AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఫై స్లోగా ఉందా..? ఈ టిప్స్‌తో ఇంటర్నెట్‌ సమస్యలకు చిటికెలో చెక్ పెట్టొచ్చు

ఆన్‌లైన్ మీటింగ్స్ మధ్యలో కట్ అవ్వడం, వీడియోలు బఫర్ అవ్వడం.. ఈ సమస్యలు అందరికీ ఎదురయ్యేవే. ఇలాంటప్పుడు వెంటనే ఇంటర్నెట్ కంపెనీకి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తుంటాం. కానీ సమస్య నెట్‌వర్క్‌లో ఉండకపోవచ్చు! ఇంట్లో మనం చేసే చిన్న చిన్న తప్పులే వైఫై స్పీడ్‌ను తగ్గిస్తుంటాయి. మరి ఆ సమస్యలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం!

వైఫై స్లోగా ఉందా..? ఈ టిప్స్‌తో ఇంటర్నెట్‌ సమస్యలకు చిటికెలో చెక్ పెట్టొచ్చు
Boost Your Wi Fi Speed.jpg
Nikhil
|

Updated on: Jun 18, 2026 | 9:29 PM

Share

ఇంట్లో వైఫై ఉన్నా వేగం తక్కువగా ఉందా? ఈ స్లో ఇంటర్నెట్ సమస్యకు కారణం కేవలం మీ సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే కాదు. రౌటర్ ప్లేస్‌మెంట్ నుండి పాస్‌వర్డ్ వరకు చాలా కారణాలు వైఫై పనితీరును ప్రభావితం చేస్తాయి. అసలు మీ వైఫై ఎందుకు నెమ్మదిగా పనిచేస్తుందో, స్పీడ్‌ను రెట్టింపు చేయడానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం!

స్పీడ్ తగ్గడానికి కారణాలు

వైఫై నెమ్మదిగా ఉన్నప్పుడు వెంటనే ఇంటర్నెట్ ప్రొవైడర్‌ను నిందించడం సహజం. కానీ, మన ఇంట్లో ఉన్న కొన్ని చిన్న విషయాల వల్ల కూడా ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంటుంది. రౌటర్‌ను సరైన ప్రదేశంలో ఉంచకపోవడం దీనికి ప్రధాన కారణం. చాలా మంది రౌటర్‌ను అల్మారాల్లో లేదా మూలల్లో దాస్తుంటారు. దీనివల్ల గోడలకు తగిలి సిగ్నల్ బలహీనపడుతుంది. రౌటర్‌ను ఇంటి మధ్య భాగంలో, ఓపెన్ ప్రదేశంలో ఉంచడం వల్ల సిగ్నల్ సమానంగా అన్ని గదులకు చేరుతుంది.

డివైస్‌ల భారం..

నేడు ప్రతి ఇంట్లోనూ మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్ వంటి అనేక గ్యాడ్జెట్లు ఉంటాయి. వీటన్నింటికీ ఒకే వైఫై కనెక్షన్ ఉండటం వల్ల బ్యాండ్‌విడ్త్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే, చాలా కాలంగా రీస్టార్ట్ చేయని రౌటర్లు పనితీరును మందగింపజేస్తాయి. అప్పుడప్పుడు రౌటర్‌ను ఆఫ్ చేసి, కాసేపటి తర్వాత ఆన్ చేయడం వల్ల సాఫ్ట్‌వేర్ పరమైన చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక రౌటర్ పాత మోడల్ అయితే, ప్రస్తుత హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అది సపోర్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి కొత్త రౌటర్‌ను తీసుకోవడం మంచిది.

పాస్‌వర్డ్ భద్రత

మీ వైఫై పాస్‌వర్డ్ పంచుకోవడం వల్ల మీకు తెలియకుండానే పక్కవారు కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాండ్‌విడ్త్ వృథా కాకుండా ఉండాలంటే పాస్‌వర్డ్‌ను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. అలాగే, మైక్రోవేవ్ ఓవెన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా సిగ్నల్ అంతరాయానికి కారణమవుతాయి. వీటిని రౌటర్‌కు దగ్గరగా ఉంచకూడదు.

సమస్య ఎప్పుడూ నెట్‌వర్క్ కంపెనీ వల్లే వస్తుందని భావించకండి. పైన చెప్పిన విషయాలను గమనించి, చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వైఫై వేగాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. స్పీడ్ తగ్గినప్పుడు ఇంట్లోనే ఈ విషయాలను ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ చిట్కాలను ఫాలో అయితే, బఫరింగ్ లేని వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందవచ్చు!

Follow Us
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే
పశువుల కోసం వచ్చి సడెన్‌గా ఇంట్లో దూరిన సింహం.. మహిళ ఏం చేసిదంటే
రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?
రూ.10 లక్షల లోపు కారు కొనాలనుకుంటున్నారా?
మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్
మీ కారు మైలేజీని పెంచుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరు చెప్పని ట్రిక్స్
ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..
ఇప్పటివరకు ఆ స్టార్ హీరోతో కలిసి నటించని రాజీవ్ కనకాల..
సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ ఆయిల్ vs రైస్ బ్రాన్ ఆయిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ
కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ
రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
రోడ్డుపై దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన విద్యార్థి
పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది
పండగ వేళ బంపర్‌ ఆఫర్‌.. ఈ కారు ధర ఏకంగా రూ.34 లక్షల వరకు తగ్గింది
ఎంత కష్టమొచ్చే.. గర్భిణీకి పురిటి కష్టాలు..
ఎంత కష్టమొచ్చే.. గర్భిణీకి పురిటి కష్టాలు..