Blaupunkt Boom Boxes: ఇదేం సౌండ్ క్లారిటీరా బాబూ.. థియేటర్ రేంజ్‌లో ఉందిగా.. ధరకూడా చాలా తక్కువే..
మ్యూజిక్ ప్రియులకు శుభవార్త. అతి తక్కువ ధరలోనే క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్లారిటీని అందించే బూమ్ బాక్స్ లను జర్మనికి చెందిన ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీదారు బ్లాపంక్ట్(Blaupunkt) ఆవిష్కరించింది.
మ్యూజిక్ ప్రియులకు శుభవార్త. అతి తక్కువ ధరలోనే క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్లారిటీని అందించే బూమ్ బాక్స్ లను జర్మనికి చెందిన ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీదారు బ్లాపంక్ట్(Blaupunkt) ఆవిష్కరించింది. బీబీ25, బీబీ50 బూమ్ బ్యాక్సెస్ ను ఆర్జీబీ లైట్లు, ఫాస్ట్ చార్జింగ్ వంటి సామర్థ్యాలతో లాంచ్ చేసింది. ఈ బ్లాపంక్ట్ బూమ్ బాక్స్ ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బ్లాపంక్ట్ బీబీ25, బీబీ 50 స్పెక్స్..
బ్లాపంక్ట్ బీబీ25, బీబీ 50 బూమ్‌బాక్స్‌లు ఇన్‌బిల్ట్ ఆర్జీబీ లైట్‌లను కలిగి ఉంటాయి. సౌండ్ బార్ లో ప్లే అవుతున్న మ్యూజిక్ కి అనుగుణంగా అవి ఆరుతూ వెలుగుతూ ఉంటాయి. సౌండ్ అండ్ లైట్ షో గా దీనిని బ్లాపంక్ట్ పిలుస్తోంది. బీబీ 50 బూమ్ బాక్స్ 50వాట్ల సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. బీబీ25 బాక్స్ 35వాట్ల సౌండ్ అవుట్ పుట్ ని ఇస్తుంది. ఈ రెండూ కూడా లోతైన బేస్, స్పష్టతతో కూడిన ఆడియో అవుట్ పుట్ ని అందిస్తాయి. బీబీ25 బూమ్‌బాక్స్ లో 3,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పది గంటల వరకూ ఆగకుండా పనిచేస్తుంది. అదే బీబీ50 బాక్స్ లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 12 గంటల వరకు ప్లే టైమ్‌ని అందిస్తుంది. ఈ బూమ్ బాక్స్ లలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే బ్లాపంక్ట్ కు చెందిన ప్రసిద్ధ టర్బో వోల్ట్ టెక్నాలజీ ఈ బాక్స్ లలో ఇన్ బిల్ట్ చేశారు. దీని ద్వారా అధిక సామర్థ్యంతో ఇవి పనిచేస్తాయి.
బ్లాపంక్ట్ బీబీ25, బీబీ 50 ఫీచర్లు..
ఫీచర్ల విషయానికొస్తే, బీబీ25 బాక్సుల్లో డ్యూయల్ 3-అంగుళాల స్పీకర్లు ఉంటాయి. బీబీ50లో డ్యూయల్ 4-అంగుళాల స్పీకర్లు ఉంటాయి. తరువాతి కూడా డ్యూయల్ పాసివ్ రేడియేటర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, యూఎస్బీ, ఎఫ్ఎం రేడియో, ఏయూఎక్స్, టీఎఫ్ కార్డ్, మైక్ అవుట్ ఉన్నాయి. ఇంకా, పవర్ ఆన్/ఆఫ్.. వాల్యూమ్ అప్/డౌన్ బటన్‌లతో పాటు ప్రత్యేక ఆర్జీబీ లైట్ బటన్, మూడ్ సెలెక్టర్, బేస్ బూస్టర్ ఉంటాయి . మీరు కచేరీ సెషన్‌లను హోస్ట్ చేయడానికి మైక్రోఫోన్, వివిధ నియంత్రణల కోసం రిమోట్ కంట్రోల్‌ని కూడా పొందుతారు.
బ్లాపంక్ట్ బీబీ25, బీబీ 50 ధర, లభ్యత..
బ్లాపంక్ట్ ఆటొమిక్ బీబీ25 ధర రూ. 3,999, బీబీ50 బూమ్‌బాక్స్ రిటైల్ రూ. 4,999 గా ఉంది. ఈ రెండింటినీ ఇప్పుడు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..