Smartphone: కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌

|

Sep 07, 2024 | 3:42 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ యూజర్ల కోసం మంచి సేల్‌ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ ఫెస్టివల్ సేల్‌ 2024 పేరుతో ఈ సేల్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్స్ను అందిస్తున్నారు. సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌...

Smartphone: కొత్త ఫోన్‌ కొనే వారికి కరెక్ట్ టైమ్‌.. అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌
Amazon Sale
Follow us on

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ యూజర్ల కోసం మంచి సేల్‌ను నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ ఫెస్టివల్ సేల్‌ 2024 పేరుతో ఈ సేల్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌పై మంచి డిస్కౌంట్స్ను అందిస్తున్నారు. సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌ బ్రాండ్‌లకు చెందిన ఫోన్‌లపై గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గింపు ధర లభిస్తోంది. సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు అమెజాన్‌ ఎలక్ట్రానిక్‌ సేల్‌ కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ ఏంటి.? వాటిపై ఎంత డిస్కౌంట్ లభించనుంది? ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ కంపెనీకి చెందిన గ్యాలక్సీ ఎమ్‌35 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్‌ ధర రూ. 19,998 కాగా.. రూ. 2 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తోంది. అలాగే వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఇక్కడితో ఆగకుండా ఈ ఫోన్‌పై రూ. 18,550 ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం అందిస్తోంది. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా తగ్గింపు పొందొచ్చు ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో Exynos 1380 అందించారు.

కెమెరా విషయానికొస్తే గ్యాలక్సీ ఎమ్‌35 5జీ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌లో 13 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు.ఈ ఫోన్‌ను డార్క్‌ బ్లూ, లైట్ బ్లూ, గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్‌4 ఫోన్‌పై మంచి ఆఫర్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌పై రూ. 2వేల డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ రూ. 2,998కి లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి ర. 1500 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ. 25,200 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. వన్‌ప్లస్ నార్డ్‌ 4 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10 హెచ్‌జెడ్ రిజల్యూషన్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 ప్లస్ జెన్‌ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోనలో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..