ప్రస్తుత కాలంలో చాలా మంది సొంత కారు కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఇక కారు లేని వారు కూడా డ్రైవింగ్ నేర్చుకునే ఉంటారు. అయితే, ప్రతి వాహనానికి ఇంజిన్ చాలా కీలకం. కారుకు కూడా ఇంజిన్ ఉంటుంది. అయితే, ఈ ఇంజిన్ కారు ముందు భాగంలో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని స్పోర్ట్స్ కార్లకు వెనుక భాగంలో ఇంజిన్ ఉన్నప్పటికీ 99 శాతం కార్లకు ఇంజిన్ ముందు భాగంలోనే ఉంటుంది. మరి కారు మధ్యలో లేదా వెనుక భాగంలో ఇంజిన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ఎప్పుడైనా ఆలోచించారా? కారు ముందు భాగంలోనే ఇంజిన్ ఎందుకు ఏర్పాటు చేశారు? దీని వెనకున్న కారణం ఏంటి? ఇందుకు సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వాస్తవానికి కార్లలో ముందు భాగంలో ఇంజిన్ ఏర్పాటు చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఇది శాస్త్రీయపరంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాటు చేశారు. ఇంజిన్ బరువు వాహనం ముందుకు వెళ్లడాన్ని సులభతరం చేస్తుంది. కారు స్టీరింగ్ మెరుగ్గా నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుంది.
కారు ఇంజిన్‌ను కారు ముందు భాగంలో ఏర్పాటు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కారు లోపలి స్థలాన్ని పెంచడం, ఇంజిన్ ఏర్పాటును సులభతరం చేయడం. ముందు భాగంలో ఇంజిన్ ఏర్పాటు చేయడం వలన.. సులభంగా యాక్సెస్ చేయడం, ఏవైనా మార్పులు, భాగాలను ఛేంజ్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే.. ఇంజిన్‌ను ముందు భాగంలో పెట్టడం వలన వెనుక భాగంలో ఖాళీ స్థలం ఉంటుంది.
ఇంజిన్ ముందుకు ఏర్పాటు చేయడం వలన కారు ఇరుసు అటూ ఇటూ కదలకుండా నియంత్రణలో ఉంటుంది. ఇంజిన్ యాక్సిల్ పైన ఉంటుంది. ఇది కారును సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. కారు టైర్లు ఇంజిన్‌కు దగ్గరగా ఉన్నందున.. ఇంజిన్ ఉత్పత్తి శక్తి కూడా పెరుగుతుంది.
కారు ముందు భాగంలో ఉన్న ఇంజిన్ బరువు కారణంగా.. ఇది త్వరణం సమయంలో సమతుల్యంగా ఉంటుంది. గాలి ఒత్తిడిని నియంత్రిస్తుంది. అతి వేగంగా వెళ్లినా.. నియంత్రణ కోల్పోదు.
ఇంజిన్ కారు ముందు భాగంలో ఉండటం వలన ఎదురుగా వచ్చే గాలి వలన అది కూల్ అవుతుంది. కారు నడుపుతున్నప్పుడు గాలి నేరుగా ఇంజిన్‌కు తగులుతుంది. తద్వారా ఇంజిన్ చల్లబడుతుంది. దీంతోపాటు.. ప్రయాణికుల భద్రత పరంగా ఉపయుక్తంగా ఉంటుంది. ఏదైనా సందర్భంలో ప్రమాదం ఎదురైనా.. మొదటగా ఇంజిన్ మాత్రమే దెబ్బతింటుంది. లోపలి ప్రయాణికులు క్షేమంగా ఉంటారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇదే వాస్తవం అని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..