Laptop: అసుస్ నుంచి అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు..మరి ధర ఎంతో తెలుసా?

|

Apr 16, 2021 | 7:21 PM

తైవానీస్ టెక్ దిగ్గజం ఆసుస్ రెండు సరికొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15 అలాగే జెన్‌బుక్ డుయో 14 ల్యాప్‌టాప్‌లు రెండు విడుదల చేయడానికి సిద్ధం చేసినట్టు ప్రకటించింది అసుస్

Laptop: అసుస్ నుంచి అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు..మరి ధర ఎంతో తెలుసా?
Asus Laptop
Follow us on

Laptop: తైవానీస్ టెక్ దిగ్గజం ఆసుస్ రెండు సరికొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15 అలాగే జెన్‌బుక్ డుయో 14 ల్యాప్‌టాప్‌లు రెండు విడుదల చేయడానికి సిద్ధం చేసినట్టు ప్రకటించింది అసుస్. ఈ రెండు మోడళ్ళు కూడా డ్యూయల్ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తాయి. శక్తివంతమైన ఇంటర్నల్‌తో ఉన్న ఈ రెండు ల్యాప్‌టాప్‌లు, వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించడమే ధ్యేయంగా సిద్ధం చేసినట్టు అసుస్ ప్రకటించింది. డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీతో, ప్రొఫెషనల్ వినియోగదారుల వర్క్ ఫ్లో మరింత సమర్థవంతంగా ఈ ల్యాప్‌టాప్‌లతో మారుతుందని అసుస్ చెబుతోంది.

ఆసుస్ జెన్‌బుక్ ప్రో డుయో 15..

పేరులో చెప్పినట్లుగానే జెన్‌బుక్ ప్రో డుయో 15 టచ్‌స్క్రీన్ సపోర్ట్‌తో 15.6-అంగుళాల 4 కె ఓఎల్‌ఇడి ప్యానల్‌తో వస్తుంది. అలాగే, ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్ దీనికి అమర్చారు. ల్యాప్‌టాప్‌లో టచ్ స్క్రీన్ అదేవిధంగా స్టైలిష్ సపోర్ట్‌తో సెకండరీ 14.1-అంగుళాల 4 కె డిస్‌ప్లే కూడా దీనిలో ఉంది. ఇక ఈ ల్యాప్‌టాప్‌ ఇది 32GB RAM-1TB SSD తో వస్తుంది.

గ్రాఫిక్స్ కోసం, జెన్‌బుక్ ప్రో డుయో 15 ఎన్విడియా జిఫోర్స్ ఆర్‌టిఎక్స్ 3070 జిపియును 8 జిబి విఆర్‌ఎమ్‌తో అమర్చబడి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ 92Wh లిథియం-పాలిమర్ బ్యాటరీతో పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌లో హర్మాన్ కార్డాన్ స్పీకర్లు, AI నాయిస్-క్యాన్సింగ్, డ్యూయల్-బ్యాండ్ వైఫై 6 వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఆసుస్ జెన్‌బుక్ ద్వయం 14

ఆసుస్ జెన్‌బుక్ డుయో 14 లో 14-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్రైమరీ డిస్‌ప్లే అలాగే, 12.65-ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది ఇంటెల్ కోర్ ఐ 5 లేదా కోర్ ఐ 7 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది 16GB RAM -1TB NVMe SSD అమర్చి ఉంటుంది. ల్యాప్‌టాప్‌లో 2 జిబి ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 450 గ్రాఫిక్స్ కార్డ్ కూడా వస్తుంది.

ధర మరియు లభ్యత
ఆసుస్ జెన్‌బుక్ డుయో 14 ప్రారంభ ధర రూ. 99,990గా అసుస్ పేర్కొంది. ఫ్లాగ్‌షిప్ జెన్‌బుక్ ప్రో డుయో 15 ప్రారంభ ధర రూ. 2,39,990గా ఉంది. ఈ రోజు నుండి డుయో 14 అందుబాటులో ఉండగా, ప్రో డుయో 15 వచ్చే నెలలో మార్కెట్ లోకి వస్తుంది.

Also Read: Battery Life: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతోందా? మరేం పర్వాలేదు ఇలా చేయండి.. బ్యాటరీ లైఫ్ పెంచుకోండి..

Malware Attacks India: భారతీయుల మొబైల్‌ ఫోన్లు టార్గెట్‌గా భారీగా పెరిగిన మాల్వేర్‌ దాడులు.. 5 నెలల్లో ఏకంగా..