Asus Zenbook 14: మార్కెట్‌లోకి మరో నయా ల్యాప్‌టాప్‌ రిలీజ్‌ చేసిన ఆసస్‌.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!

పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో రిలీజ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్‌ చేసే కంపెనీ ఆసస్‌ తాజాగా మరో ల్యాప్‌టాప్‌తో మన ముందుకు వచ్చింది. తైవానీస్ ఎలక్ట్రానిక్ తయారీదారై ఆసస్‌ ఇటీవల భారతదేశంలో జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది.

Asus Zenbook 14: మార్కెట్‌లోకి మరో నయా ల్యాప్‌టాప్‌ రిలీజ్‌ చేసిన ఆసస్‌.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!
Asus Zenbook 14

Updated on: Jan 26, 2024 | 9:30 AM

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రతి ఇంట్లో తప్పనిసరి వస్తువుగా మారాయి. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరగడంతో ఎక్కువ శాతం ఈ ల్యాప్‌టాప్‌లు అవసరమయ్యాయి. అలాగే పిల్లల ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు వారి ప్రాజెక్ట్‌ వర్క్క్‌ వంటి అవసరాల కోసం ల్యాప్‌టాప్‌లు తప్పనిసరయ్యాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో రిలీజ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్‌ చేసే కంపెనీ ఆసస్‌ తాజాగా మరో ల్యాప్‌టాప్‌తో మన ముందుకు వచ్చింది. తైవానీస్ ఎలక్ట్రానిక్ తయారీదారై ఆసస్‌ ఇటీవల భారతదేశంలో జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌ ధరతో పాటు స్పెసిఫికేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌ల ద్వారా ఆధారంగా పని చేసే ఆసస్‌ జెన్‌బుక్‌ 14 ల్యాప్‌టాప్ 3 కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 14 గుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ర రూ.99,990 ధర నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా 32 జీబీ + 1 టీబీ ఎస్‌ఎస్‌డీ నిల్వతో వస్తుంది. ఆసస్‌ జెన్‌బుక్‌ 14 ఓఎల్‌ఈడీ జనవరి 31 నుంచి  ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

ఆసస్‌ జెన్‌బుక్‌ స్పెసిఫికేషన్లు

ఆసస్‌ జెన్‌బుక్ 14 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 14 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ (నాన్-టచ్), 14 అంగుళాల 3కే  120హెచ్‌జెడ్‌ టచ్‌స్క్రీన్. ఈ ల్యాప్‌టాప్ బరువు 1.2 కిలోలు. అలాగే 14.9 ఎంఎం థిక్‌నెస్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో థండర్‌బోల్ట్‌ 4 పోర్ట్‌లు, ఒక యూఎస్‌బీ, 3.2 జెన్‌ 1 టైప్‌ ఏ పోర్ట్‌తో వస్తుంది. 2.1 హెచ్డీఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. విండోస్‌ 11 ఆధారంగా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌  ఐ5, ఐ7 ప్రాసెసర్‌లతో అందుబాటులో ఉంటుంది. 75 డబ్ల్యూహెచ్‌ లిథియం-పాలిమర్ బ్యాటరీ, 65 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..