Asus Chromebook CX 1101: ఆసుస్ నుంచి సరికొత్త బడ్జెట్ క్రోమ్‌బుక్.. దీని ధర.. స్పెసిఫికేషన్లు ఇలా..

|

Dec 13, 2021 | 10:25 PM

ఆసుస్ తన బడ్జెట్ క్రోమ్‌బుక్ (ల్యాప్‌టాప్)ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని మోడల్ నంబర్ CX1101. ఈ క్రోమ్‌బుక్(Chromebook) 11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది.

Asus Chromebook CX 1101: ఆసుస్ నుంచి సరికొత్త బడ్జెట్ క్రోమ్‌బుక్.. దీని ధర.. స్పెసిఫికేషన్లు ఇలా..
Asus Chromebook
Follow us on

Asus Chromebook CX 1101:  ఆసుస్ తన బడ్జెట్ క్రోమ్‌బుక్ (ల్యాప్‌టాప్)ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని మోడల్ నంబర్ CX1101. ఈ క్రోమ్‌బుక్(Chromebook) 11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్‌తో 4GB RAM, 64GB eMMC స్టోరేజ్‌తో అందుబాటులోకి వస్తోంది.

Asus Chromebook CX1101 ధరెంతో తెలుసా?

ఈ క్రోమ్‌బుక్ (Chromebook) ప్రారంభ ధర రూ. 19,999. దీని సేల్ డిసెంబర్ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 15 నుండి 21 వరకు ఈ క్రోమ్‌బుక్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు కంపెనీ రూ.1,009 తగ్గింపును అందిస్తుంది. అంటే రూ.18,990కే కొనుగోలు చేయగలుగుతారు.

Asus Chromebook CX1101 స్పెసిఫికేషన్‌లు ఇవే..

ఈ Chromebook 11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ HD LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది డ్యూయల్-కోర్ ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్.. 4GB LPDDR4 ర్యామ్, 64GB eMMC స్టోరేజ్ ద్వారా ఉంది. ఇది Google Chrome ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. క్రోమ్‌బుక్‌కు కఠినమైన డిజైన్ ఇచ్చారు. ఎందుకంటే, అందులో ఈ మెటల్ ఉపయోగించారు. స్క్రీన్ ను 180-డిగ్రీల వరకు తిప్పవచ్చు.

Chromebook 3-సెల్ 42Whr బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 13 గంటల వరకు బ్యాకప్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇది 45W USB-టైప్ C ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇందులో రెండు USB 3.2 Type-C పోర్ట్‌లు, రెండు USB 3.2 Type-A పోర్ట్‌లు, మైక్రో SD కార్డ్ రీడర్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ల్యాప్‌టాప్ 291.6×200.9×19.5mm కొలతలతో వసుంది. దీని బరువు 1.24kg.

ఇవి కూడా చదవండి: Viral Photo: ఎవరో స్కూల్ గర్ల్ అనుకునేరు.. ఇప్పుడు సౌత్ ఇండియాను షేక్ చేస్తోన్న బోల్డ్ బ్యూటీ

Rashmika Mandanna: పుష్పరాజ్ గురించి శ్రీవల్లి   ముచ్చట్లు.. రష్మిక మందన్నా ప్రెస్‏మీట్ లైవ్..