Mobile Charging: ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి పడుకునే వారికి యాపిల్‌ వార్నింగ్‌.. ప్రత్యేక సూచనల ద్వారా అలెర్ట్

|

Aug 19, 2023 | 9:00 PM

తాజాగా యాపిల్‌ కంపెనీ కూడా ఛార్జింగ్ ఉన్న ఫోన్ పక్కన పడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వినియోగదారులకు హెచ్చరించింది. ముఖ్యంగా చార్జింగ్‌కు సంబంధిందిచ కంపెనీ చార్జర్‌ ప్రాముఖ్యతను వినియోగదారులు తెలుసుకోవాలని సూచించింది. అలాగే ఛార్జింగ్ కేబుల్‌కు కనెక్ట్ చేసిన పరికరంతో పాటు నిద్రించడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోవాలని కోరింది.

Mobile Charging: ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి పడుకునే వారికి యాపిల్‌ వార్నింగ్‌.. ప్రత్యేక సూచనల ద్వారా అలెర్ట్
Mobile Charging
Follow us on

ఇటీవల కాలంలో ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ అనేది మన జీవితంలో ఓ భాగంగా మారింది. చాలా మంది చేతిలో ఫోన్‌ లేకపోతే ఏదో వెలితిగా ఫీలవుతుంటారు. స్మార్ట్‌ ఫోన్‌ మన దగ్గర లేదు అంటే అది కేవలం చార్జింగ్‌ పెట్టే సమయంలోనే అనేది అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది ఆ సమయంలో కూడా ఫోన్‌ వాడుతూ ఉంటారు. మరికొంత పడుకునే సమయంలో ఫోన్‌ చార్జ్‌ అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది మంచం పక్కన ఉన్న సాకెట్‌కు చార్జింగ్‌ పెట్టి పడుకుంటూ ఉంటారు. ఈ చర్య చాలా ప్రమాదకరమైందని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా యాపిల్‌ కంపెనీ కూడా ఛార్జింగ్ ఉన్న ఫోన్ పక్కన పడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వినియోగదారులకు హెచ్చరించింది. ముఖ్యంగా చార్జింగ్‌కు సంబంధిందిచ కంపెనీ చార్జర్‌ ప్రాముఖ్యతను వినియోగదారులు తెలుసుకోవాలని సూచించింది. అలాగే ఛార్జింగ్ కేబుల్‌కు కనెక్ట్ చేసిన పరికరంతో పాటు నిద్రించడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోవాలని కోరింది. వినియోగదారులకు యాపిల్‌ చేసిన తాజా హెచ్చరికల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ముఖ్యంగా చార్జింగ్‌ పెట్టిన పరికరాన్ని దుప్పటి లేదా దిండు కింద పెడితే అది త‍్వరగా వేడెక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్‌ను పవర్ అడాప్టర్ లేదా వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రపోకండి, పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు వాటిని దుప్పటి, దిండు లేదా మీ శరీరం కింద ఉంచకుండా ఉండాలని యాపిల్‌ సూచిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్‌లు, పవర్ అడాప్టర్‌లు, వైర్‌లెస్ ఛార్జర్‌లను ఎల్లప్పుడూ బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశాల్లో ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించింది.

థర్డ్‌పార్టీ చార్జర్లతో సమస్యలు

థర్డ్-పార్టీ ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల వచ్చే సంభావ్య ప్రమాదాన్ని యాపిల్‌ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్‌ అధికారిక ఉత్పత్తుల ఖరీదు ఎక్కువగా ఉండడంతో చాలా మంది థర్డ్‌ పార్టీ చార్జర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదమని ముఖ్యంగా అంతర్జాతీయ భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండే “మేడ్ ఫర్ ఐఫోన్” కేబుల్‌లను ఎంచుకోవాలని యాపిల్‌ వినియోగదారులకు సలహా ఇస్తుంది. థర్డ్-పార్టీ కేబుల్‌లు, పవర్ ఎడాప్టర్‌లను ఉపయోగించి ఐఫోన్‌ను ఛార్జ్ చేయడం సాధ్యమవుతున్నప్పటికీ ఇతర అడాప్టర్‌లు ఈ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవచ్చని కంపెనీ వివరించింది. 

ఇవి కూడా చదవండి

అగ్ని ప్రమాదాలు

వినియోగదారులు లిక్విడ్‌లు లేదా నీటి దగ్గర ఫోన్‌లను ఛార్జింగ్ చేయడాన్ని నివారించాలని సూచించింది. అలాగే దెబ్బతిన్న ఛార్జర్‌లను వెంటనే విస్మరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. బలహీనమైన కేబుల్‌లు లేదా ఛార్జర్‌లను ఉపయోగించడం లేదా తేమ సమక్షంలో ఛార్జింగ్ చేయడం వల్ల మంటలు, విద్యుత్ షాక్‌లకు గురయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. వినియోగదారుల యాపిల్ సలహా వారి మార్గదర్శకాలను శ్రద్ధగా అనుసరించి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని పేర్కొంటున్నారు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..