- Telugu News Photo Gallery Technology photos Tech Tips When Buying a New SmartPhone they say Charge it Fully and Use it
Mobile Using Tips: కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశారా? వాడటానికి ముందు ఇది తప్పనిసరిగా చెక్ చేసుకోండి..
Mobile Charging Tips: ఒక మొబైల్ తయారయ్యాక.. కస్టమర్‌కు చేరుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో సెల్‌లో బ్యాటరీ లెవల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఛార్జింగ్ తగ్గితే.. దాని పనితీరు కూడా తగ్గుతుంది.
Updated on: Aug 04, 2023 | 11:53 AM

ఒక మొబైల్ తయారయ్యాక.. కస్టమర్‌కు చేరుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో సెల్‌లో బ్యాటరీ లెవల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఛార్జింగ్ తగ్గితే.. దాని పనితీరు కూడా తగ్గుతుంది.

మీరు ఏదైనా కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు దానిని ముందుగా పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేసిన తరువాతే వాడాలి. కొత్త మొబైల్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జ్ చేయకుండా ఉపయోగించొద్దు.

కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసిన ఫుల్ ఛార్జింగ్ ఎందుకు చేయాలి? ఛార్జింగ్ చేయకుండా ఎందుకు ఉపయోగించకూడదు? వాడితే ఏమవుతుంది? దీని వెనకున్న టెక్నికల్ రీజన్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

దీనికి ప్రధాన కారణం Li-ion బ్యాటరీ. కొనుగోలు కొత్త మొబైల్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి చాలా మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే Li-ion బ్యాటరీ ప్రధాన కారణం.

Li-ion బ్యాటరీ ఉపయోగించే ప్రతి మొబైల్‌లో DOD (డెప్త్ ఆఫ్ డిస్టార్షన్)ని తగ్గించాలని మొబైల్ కంపెనీలు సిఫార్సు చేస్తున్నాయి. బ్యాటరీ 100 శాతం ఛార్జ్ అంటే దాని DOD 0 శాతం అన్నమాట. అప్పుడు మీ మొబైల్‌కి ఎలాంటి సమస్యా ఉండదు.

20 శాతం తక్కువగా ఉండొద్దు: పైన పేర్కొన్న విధంగా Li-ion బ్యాటరీ DOD చాలా తక్కువగా ఉండాలి. అంటే ఫోన్‌ను స్టార్ట్ చేయడానికి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉండటం అవసరం. అయితే, కనీసం 20 శాతం కంటే తక్కువ DOD మేయింటేన్ చేయాలి. అంటే మొబైల్‌లో 80 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ చేయాలి.

20 శాతం తక్కువగా ఉండొద్దు: పైన పేర్కొన్న విధంగా Li-ion బ్యాటరీ DOD చాలా తక్కువగా ఉండాలి. అంటే ఫోన్‌ను స్టార్ట్ చేయడానికి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉండటం అవసరం. అయితే, కనీసం 20 శాతం కంటే తక్కువ DOD మేయింటేన్ చేయాలి. అంటే మొబైల్‌లో 80 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ చేయాలి.

ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుంది?: మొబైల్ కంపెనీలో తయారైన తరువాత కస్టమర్‌కు చేరుకోవడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఆ సమయంలో బ్యాటరీ సెల్స్ షార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల బ్యాటరీ పూర్తిగా డెడ్ అయితే, మొబైల్ పనితీరు తగ్గుతుంది. అందుకే.. కొత్త మొబైల్‌ను ఉపయోగించడానికి ముందు ఫుల్ ఛార్జింగ్ పెట్టాలి.





























