Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poco M6 Pro: పోకో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 15 వేలకే ఇన్ని ఫీచర్లా..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ తీసుకొస్తోంది. పోకో ఎమ్‌6 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌ను అందించారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌తో పనిచేయడం విశేషం. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. భారీ స్క్రీన్‌, భారీ బ్యాటరీతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్‌ ఆగస్టు 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 04, 2023 | 9:30 AM

 ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫక్షన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎమ్‌6 ప్రో పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఆగస్టు 5న లాంచ్‌ కానుంది.

1 / 5
ప్రముఖ ఈకామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,999, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,999గా ఉంది.

2 / 5
పోకో ఎమ్‌6 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 6.79 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
పోకో ఎమ్‌6 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

5 / 5
Follow us