AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava blaze 5g: తక్కువ ధరలో 5జీ ఫోన్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా.? అయితే ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి..

దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా బ్లేజ్‌ పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ కోసం సెర్చ్‌ చేస్తున్న వారికి ఈ స్మార్ట్ ఫోన్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పేరుకు బడ్జెట్ ఫోన్‌ అయినా ఇందులో అన్ని రకాల ఫీచర్లను అందించారు. 1టీబీ వరకు మెమోరీని పెంచుకోవడం ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇంతకీ లావా బ్లేజ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Aug 03, 2023 | 9:36 PM

దేశీయ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్‌ పేరుతో తీసుకొచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్‌.. కంపెనీ అధికారిక వెబ్‌ సైట్‌తో పాటు అమెజాన్‌ ఇండియాలో అందుబాటులో ఉంది.

1 / 5
ఇక స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 12,999గా ఉంది. ఆండ్రాయిడ్ 13 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

2 / 5
లావా బ్లేజ్‌లో 6.51 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 720x1,600 రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ ద్వారా పని చేస్తుంది.

3 / 5
స్మార్ట్‌ ఫోన్‌ మెమోరీని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

4 / 5
 కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us