- Telugu News Photo Gallery Technology photos Honor launching new smartwatch Honor watch 4 features and price details
Honor Watch 4: హానర్ నుంచి స్మార్ట్ వాచ్ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ సందడి చేస్తోంది. ఒకప్పుడు కేవలం టాప్ బ్రాండ్‌లు మాత్రమే స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకురావడంతో ధరలు భారీగా ఉండేవి. అయితే తాజాగా కంపెనీల మధ్య కాంపిటేషన్ పెరగడం, చిన్న చిన్న కంపెనీలు సైతం స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తుండడంతో వాచ్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా హానర్ కంపెనీ కూడా కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. హానర్ వాచ్ 4 పేరుతో ఈ వాచ్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానుంది..
Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Aug 05, 2023 | 7:22 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. హానర్ వాచ్ 4 పేరుతో ఈ వాచ్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు..

హానర్ వాచ్ 4లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 1.75 ఇంచెస్ అమోఎల్‌ఈడి డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 390 x 450 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత.

ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ అందించారు. దీనిద్వారా నేరుగా వాచ్‌తోనే కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్స్ కూడా స్పీకర్ సహాయంతో మాట్లాడుకోవచ్చు.

ఇక హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హార్ట్‌బీట్ మానిటర్, రక్త ఆక్సిజన్ స్థాయి సెన్సార్‌లు, స్లీప్ మానిటరింగ్ సెన్సార్, స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఫీచర్లను అందించారు.

అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్‌లో 5ATM వరకు వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. దీంతో నీటిలో ఉపయోగించినా ఈ వాచ్ పాడవదు. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని సమాచారం.





























