- Telugu News Photo Gallery Technology photos Amazon great freedom sale Best smartphone under 10k Telugu Tech News
Smartphones Under 10K: స్మార్ట్ ఫోన్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్స్.. రూ. 10 వేలలో సూపర్ ఫీచర్స్.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ ఆఫర్స్‌ను ప్రకటించారు. కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఏకంగా 45 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వీటిలో సామ్‌సంగ్, రెడ్‌మీతో పాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో భాగంగా డిస్కౌంట్ పోను రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 04, 2023 | 11:57 AM

Itel S23: ఐటెల్ ఎస్23 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999కాగా, 23 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,499కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత.

Realme narzo N53: 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999 కాగా, 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 8,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు.

Redmi 12C: రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా 45 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 7699కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 6.71 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.

Samsung Galaxy M04: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్04 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,499కాగా 40 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,099కి సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఇందులో 6.5 ఇంచెస్ ఎల్‌సీడీ, హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

Samsung Galaxy M13: ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999 కాగా 36 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,649కి సొంతం చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం.




