ఆపిల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఐఫోన్‌..! లాంచ్‌ తేదీ, ధర, ఫీచర్లు ఇవేనా?

ఆపిల్ ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ ఐఫోన్ 2026 సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 సిరీస్‌తో విడుదల కానుంది. దీని ధర సుమారు 1,999 డాలర్లు ఉండవచ్చు. 7.76-అంగుళాల ప్రధాన స్క్రీన్, 5.4-అంగుళాల కవర్ డిస్‌ప్లే, సన్నని డిజైన్, డ్యూయల్ కెమెరా దీని ముఖ్య ఫీచర్లుగా ఉండొచ్చు.

ఆపిల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఐఫోన్‌..! లాంచ్‌ తేదీ, ధర, ఫీచర్లు ఇవేనా?
Foldable Iphone

Updated on: Dec 21, 2025 | 9:30 AM

ఆపిల్ నుంచి ప్రతిష్టాత్మక ఫోల్డబుల్ ఐఫోన్ కొత్త ఏడాదిలో విడుదల కావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్ విడుదలైన సమయంలోనే దీన్ని కూడా లాంచ్‌ చేసే అవకాశం ఉంది. ఇటీవల ఈ ఫోన్ ఎలా ఉంటుందో, దాని ధర ఎంత ఉండవచ్చనే దానిపై కొన్ని గాసిప్స్‌ వచ్చాయి.

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఫోల్డబుల్‌ ఐఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి.. 7.76-అంగుళాల భారీ ప్రధాన ఫోల్డబుల్ స్క్రీన్, 5.4-అంగుళాల చిన్న బయటి కవర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కవర్ డిస్ప్లే శామ్సంగ్ ఫోల్డబుల్ పోటీదారుల కంటే చిన్నదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఐప్యాడ్ మినీలాగా అనిపిస్తుంది. ఇది 83.8mm వెడల్పు, 120.6mm ఎత్తు, తెరిచినప్పుడు కేవలం 4.8mm మందంతో చాలా సన్నగా ఉంటుందని (మడచినప్పుడు 9.6mm వరకు విస్తరిస్తుంది) సమాచారం. 1.8mm హింజ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది, సెల్ఫీ కెమెరా కోసం ప్రధాన స్క్రీన్‌పై పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.

అంచనా ధర, లాంచ్ తేదీ!

ఆపిల్ ఎటువంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయనప్పటికీ ఫోల్డబుల్ ఐఫోన్ ధర సుమారు 1,999 డాలర్లు ( మన కరెన్సీలో సుమారు రూ.1,74,000) ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ సెప్టెంబర్ 2026 లాంచ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి