Apple-1: ఆపిల్ తొలి కంప్యూటర్ ఎంత ధరకు అమ్ముడు పోనుందో తెలుసా..? అక్షరాల రూ.11 కోట్లకుపైమాటే.. ఇంతకీ అంతలా ఏముందనేగా..

|

Feb 12, 2021 | 6:30 PM

Apple Computer Put Up On Sale For Rs 11 Crore: ‘ఆపిల్’.. ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను జనాలు ఎగబడి కొంటుంటారు. అంతేనా.. ఆపిల్ బ్రాండ్ ఉపయోగిస్తున్న వారిని గొప్ప వారిగా చూసే వారు...

Apple-1: ఆపిల్ తొలి కంప్యూటర్ ఎంత ధరకు అమ్ముడు పోనుందో తెలుసా..? అక్షరాల రూ.11 కోట్లకుపైమాటే.. ఇంతకీ అంతలా ఏముందనేగా..
Follow us on

Apple Computer Put Up On Sale For Rs 11 Crore: ‘ఆపిల్’.. ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను జనాలు ఎగబడి కొంటుంటారు. అంతేనా.. ఆపిల్ బ్రాండ్ ఉపయోగిస్తున్న వారిని గొప్ప వారిగా చూసే వారు కూడా ఉన్నారు. అంతలా తన బ్రాండ్ పెంచుకుంటూ పోయిందీ కంపెనీ.
ఇదిలా ఉంటే తాజాగా యాపిల్ కంపెనీకి చెందిన తొలి కంప్యూటర్‌ను అమ్మకానికి ఉంచారు. ‘ఆపిల్-1’ పేరుతో రూపొందించిన ఈ కంప్యూటర్‌ను వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి రూపొందించడం విశేషం. 1976లో తయారు చేసిన ఈ తొలి కంప్యూటర్‌ను చెక్క కేసుతో రూపొందించారు. ఇన్నేళ్లు గడుస్తోన్న ఈ కంప్యూటర్ ఇంకా పనిచేస్తుండడం విశేషం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కంప్యూటర్‌ను అమ్మకానికి ఉంచారు. 1978లో సుమారు 666 డాలర్లకు కొనుగోలు చేసిన కృష్ణ బ్లేక్ అనే వ్యక్తి ఈ కంప్యూటర్‌ను అమ్మకానికి పెట్టారు. ఈ-బే వెబ్‌సైట్‌లో ఏకంగా 15,00,000 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.11 కోట్లకు పైమాటే. ఈ కంప్యూటర్‌ను తయారు చేసిన నాటి నుంచి పోల్చితే.. ఇప్పుడు ఏకంగా 2,250 రెట్లు అధిక ధరకు దీన్ని అమ్మనున్నారు. ప్రస్తుతం పనిచేస్తోన్న ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయదు కాబట్టి.. ఈ కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలిపే ఒక యూజర్ మాన్యువల్ బుక్ కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ కంప్యూటర్‌ను ఫ్లోరిడా బ్యాంక్ ఖాజానాలో భద్రపరిచారు.

Also Read: Artificial Blood For Humans: అన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల వారికి సరిపోయే విధంగా కృత్రిమ రక్తాన్ని సృష్టించిన మానవ మేథస్సు