Infinix hot 50: ఇన్ఫినిక్స్ నుంచి మరో బెస్ట్ ఫోన్.. ఆ ఫోన్ ఆవిష్కరణకు రంగం సిద్ధం..!

|

Aug 30, 2024 | 4:00 PM

మనదేశంలో ఇన్ఫినిక్స్ ఫోన్లను చాలా మంది వినియోగిస్తారు. చైనాకు చెందిన ఈ కంపెనీ ఫోన్లకు ఇక్కడ మార్కెట్ చాలా బాగుంది. మంచి కెమెరా, చక్కని పనితీరుతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ మరో శుభవార్త చెప్పింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ ను ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది. మన దేశంలో సెప్టెంబర్ 5న లాంచ్ చేయనుంది.

Infinix hot 50: ఇన్ఫినిక్స్ నుంచి మరో బెస్ట్ ఫోన్..  ఆ ఫోన్ ఆవిష్కరణకు రంగం సిద్ధం..!
Infinix Hot 50
Follow us on

మనదేశంలో ఇన్ఫినిక్స్ ఫోన్లను చాలా మంది వినియోగిస్తారు. చైనాకు చెందిన ఈ కంపెనీ ఫోన్లకు ఇక్కడ మార్కెట్ చాలా బాగుంది. మంచి కెమెరా, చక్కని పనితీరుతో ఈ ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ మరో శుభవార్త చెప్పింది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ ను ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసింది. మన దేశంలో సెప్టెంబర్ 5న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కు సంబంధించిన కీలక ఫీచర్లు, డిజైన్ తదితర విషయాలను ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కలిగిన ఐపీ 54 రేటింగ్ తో ఈ ఫోన్ విడుదలవుతుంది.

అతి సన్నని మోడల్

మన దేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ విడుదలను ఆ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. కొత్త ఫోన్ కు సంబంధించి హాట్ 50 4జీ, హాట్ 50 ప్రో, హాట్ 50 ప్రోప్లస్, హాట్ 50ఐ తదితర వేరియంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ 7.8 ఎంఎం (మందం) సైజులో రానుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యంత సన్నని మోడల్‌ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ధర ను అధికారికంగా వెల్లడించనప్పటికీ ఇది మిడ్‌రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారు.

అనేక ప్రత్యేకతలు

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ నలుగు, నీలం రంగులో ఎంపికలలో వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. అలాగే మైక్రోసైట్‌లోని టీజర్లు కూడా హ్యాండ్‌సెట్‌ను ఆకుపచ్చ రంగులో చూపించాయి. వెనుక వైపు మూడు దీర్థచతురస్రాకారపు గడులలో కెమెరాలను అమర్చారు. డిస్‌ప్లే సెంటర్, అలైన్డ్ హోల్, పంచ్ కటౌట్, స్లిమ్ బెజెల్స్‌ తదితర ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

వెబ్ టచ్ ఫీచర్

ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ లో వెబ్ టచ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. స్క్రీన్‌పై నీటి బిందువులు ఉన్నప్పుడు కూడా దాన్ని యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దుమ్ము, నీరు, ప్లాష్ నిరోధకత కోసం ఐపీ 54 రేటింగ్‌ కలిగిన ఫోన్ ఇది. దీనికి టీయూవీ ఎస్ యూడీ 60 నెలల ఫ్లూన్సీ సర్టిఫికేషన్‌ ఉంది.

ఎంతో ఉపయోగం

కొత్త ఫోన్ లో పనితీరు వేగంగా ఉండేలా మీడియా టెక్ డైమాన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. వేగమైన పనితీరు, సమర్థవంతమైన కనెక్టివిటీ కోసం ఇది ఉపయోగపడుతుంది. 4 జీబీ లేదా 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ స్టోరేజ్ తో అందుబాటులోకి రానుంది. ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి మల్టీ టాస్కింగ్ కోసం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..