AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone Users Alert: స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి అలర్ట్‌: ఈ 8 యాప్స్‌ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి

Smartphone Users Alert: మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..? అయితే ముఖ్యమైన అలర్ట్‌. గూగుల్‌ ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్‌ వల్ల మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..

Smartphone Users Alert: స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి అలర్ట్‌: ఈ 8 యాప్స్‌ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి
Mobile Phones Usage
Subhash Goud
|

Updated on: Jun 20, 2021 | 9:49 AM

Share

Smartphone Users Alert: మీరు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..? అయితే ముఖ్యమైన అలర్ట్‌. గూగుల్‌ ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్‌ వల్ల మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పలు యాప్స్‌లో జోకర్‌ మాల్వేర్‌ ఉన్నట్లు గుర్తించారు నిపుణులు. యాప్స్‌ ద్వారా జోకర్‌ మాల్వేర్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడి వినియోగదారుల డేటాను రహస్యంగా సేకరిస్తోంది. తర్వాత ఈ మాల్వేర్‌ యూజర్ల డేటాతో అడ్వర్టైజ్‌మెంట్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటోంది. ఈ విషయం ఫోన్ వాడే వారికి ఏ మాత్రం తెలియదు. దీని వల్ల ఫోన్ వాడే వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది. క్విక్ హీల్ సెక్యూరిటీ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 8 యాప్స్‌లో ఈ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ గురించి గూగుల్‌కు కూడా తెలియజేశారు. గూగుల్ వెంటనే ఈ యాప్స్‌ను తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ఆ 8 యాప్స్ ఏమిటో తెలుసుకుందాం. అయితే ఇలాంటి యాప్స్‌ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి మీ బ్యాంకు అకౌంట్లలో కూడా డబ్బులు మయం చేసే అవకాశాలున్నాయని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి యాప్స్‌ వల్ల ఎంతో మంది బలైన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి యాప్స్‌ వల్ల మొబైల్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నిపుణులు. ఏవి పడితే అవి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లయితే ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

1. Auxiliary Message 2. Fast Magic SMS 3. Free CamScanner 4. Super Message 5. Element Scanner 6. Go Messages 7. Travel Wallpapers 8. Super SMS ఈ యాప్స్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్నట్లయితే వెంటనే డిలీట్‌ చేయండి లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు.