Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Update: వాట్సాప్ బిజినెస్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్.. స్టేటస్‌ ఆర్కైవ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుంది. తాజా వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం స్టేటస్ ఆర్కైవ్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

Whatsapp Update: వాట్సాప్ బిజినెస్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్.. స్టేటస్‌ ఆర్కైవ్ ఫీచర్‌తో బోలెడు లాభాలు
Whatsapp
Follow us
Srinu

|

Updated on: May 31, 2023 | 7:00 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందరి ఫోన్స్‌లో ఇన్‌స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. మేసేజ్, కాల్స్, ఆడియో, వీడియో, పిక్చర్ షేరింగ్ వంటి ఫీచర్ల ఉండడంతో చాలా మంది వాట్సాప్‌ను ఇష్టపడుతున్నారు. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుంది. తాజా వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం స్టేటస్ ఆర్కైవ్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. పెరుగుతున్నటెక్నాలజీకి అనుగుణంగా వ్యాపారులు తమ కస్టమర్లకు అందుబాటులో ఉండడానికి వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌లను తీసుకున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు కస్టమర్లకు తాము అందించే అదిరిపోయే ఆఫర్ల వివరాలను తెలుపుతున్నారు. ముఖ్యంగా స్టేటస్‌ల ద్వారా ఆఫర్ల వివరాలను పేర్కొంటున్నారు. అయితే ఈ స్టేటస్‌లు కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఏరోజుకారోజు స్టేటస్‌లను అప్‌డేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి గతంలో పెట్టిన ఆఫర్లనే మళ్లీ పెడుతున్నప్పుడు మళ్లీ కొత్తగా స్టేటస్ పెట్టాల్సి వస్తుంది. అయితే వాట్సాప్ తాజాగా ఇచ్చిన అప్‌డేట్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టినట్లువ తెలుస్తుంది. వాట్సాప్ కొత్తగా రిలీజ్ స్టేటస్ ఆర్కైవ్ ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

వాట్సాప్ వ్యాపార వినియోగదారుల కోసం స్టేటస్ ఆర్కైవ్ చేసే సామర్థ్యాన్ని జోడించడానికి ఆ కంపెనీ డెవలపర్‌లు ఇప్పుడు పని చేస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ బిజినెస్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.11.18తో వినియోగదారులు పోస్ట్ చేసిన 24 గంటల తర్వాత వారి స్టేటస్ నవీకరణలను ఆర్కైవ్ చేస్తారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు యాప్ ‘స్టేటస్’ ట్యాబ్‌లో ఓ ప్రత్యక బ్యానర్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనెబుల్ చేశాక 30 రోజుల వరకు వారి పరికరాలలో అప్‌డేట్‌లు ఉంచుతారు. అలాగే ఆర్కైవ్ చేసిన అప్‌డేట్‌లను వినియోగదారు మాత్రమే చూడగలరు. బిజినెస్ ఓనర్‌లు తమ ఆర్కైవ్‌ల నుంచి స్టేటస్‌ని కస్టమర్‌లతో షేర్ చేయగలరు. కాబట్టి ఇది వారికి నిజంగా ఉపయోగకరమైన ఫీచర్. వినియోగదారులు ఈ సమయంలో ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ కోసం ప్రకటనలను కూడా సృష్టించవచ్చు. ప్రస్తుతం, ఆర్కైవ్‌కు స్టేటస్ అప్‌డేట్‌లను జోడించే సామర్థ్యం వ్యాపార వినియోగదారులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే వాట్సాప్ భవిష్యత్తులో ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారులకు అందజేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..