ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఏడాది ప్రారంభంలో ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. సాధారణ వార్షిక ప్లాన్ కు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ ప్రీమియం ధర రూ. 1,499గా ఉంది. అయితే లైట్ సబ్ స్క్రిప్షన్ దీనికన్నా తక్కువ ధర రూ. 999కే లభిస్తోంది. కానీ దీనిలో ప్రయోజనాలు కూడా పూర్తి స్థాయి సబ్ స్క్రిప్షన్ తో పోల్చితే తక్కువగా ఉంటాయి.
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని మరింత చవకగా మార్చింది అమెజాన్. మరో రూ. 200 తగ్గించి, రూ. 799కే అందిస్తోంది. ఈ ప్లాన్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆర్డర్ ఫ్రీ డెలివరీ, షాపింగ్ ఆఫర్లు ప్రకటించినప్పుడు ఒకరోజు ముందుగానే ఆఫర్లను యాక్సెస్ చేసే వీలు వంటివి ఉంటాయి. దీనికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు, ధరను ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ పేజీలో ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ హైలైట్ చేసి, వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఫ్రీ డెలివరీ.. ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ పేజీలో హైలైట్ చేసిన ప్లాన్ ప్రయోజనాల్లో ఫ్రీ డెలివరీ కూడా ఒకటి. వన్ డే డెలివరీ, టూ డే డెలివరీ, షెడ్యూల్డ్ డెలివరీ, సేమ్ డే డెలివరీ వంటి ఆప్షన్లు అందులో ఉంటాయి. కొన్ని ఎంపిక చేసిన చిరునామాలకు నో రష్ షాపింగ్ పేరిట రూ. 25 క్యాష్ బ్యాక్ లనుకూడా అందిస్తుంది. అంతేకాక ఉదయాన్నే డెలివరీ కావాలనుకుంటే మీరు షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అందుకు ఐటెంకు రూ. 175 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ స్టాండర్డ్ డెలివరీకి మినిమమ్ ఆర్డర్ వాల్యూ కూడా ఉండదు. అయితే కొన్ని నిర్ధేశిత చిరునామాలకు మాత్రమే ఈ ఉచిత డెలివరీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు అధికారిక వెబ్ సైట్లో ఈ క్రెడిట్ కార్డును షాపింగ్ చేస్తే.. ఐదు శాతం డిస్కౌంట్ ను కూడా పొందుకోవచ్చు.
ప్రైమ్ వీడియో.. ఈ ప్లాన్ కొనుగోలు చేసిన వారు అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ ను కూడా ఒక డివైజ్లో హెడ్ డీ క్వాలిటీలో ఆస్వాదించొచ్చు. అయితే మీడియా ప్లే బ్యాక్ సమయంల యాడ్స్ అయితే వస్తాయి. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ కు అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ ఎర్లీ డీల్స్.. ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ ఉన్న వినియోగదారులు ఏదైనా ప్రత్యేకమైన అమెజాన్ ఆఫర్ల సమయంలో ఒక రోజు ముందే ఆ ఆఫర్లను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..