Amazon Offers: కాస్ట్‌లీ ఫోన్లపై బంపర్ ఆఫర్స్.. ఏకంగా 39శాతం వరకూ డిస్కౌంట్.. లిస్ట్‌లో యాపిల్ ఐఫోన్ కూడా..

|

Feb 14, 2024 | 6:23 AM

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో యాపిల్ ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్ లభిస్తోంది. మీరు ఒకవేళ యాపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆశతో ఉంటే ఇదే సరైన సమయం. లేదా ఎవరికైనా గిఫ్ట్ గా యాపిల్ ఫోన్ ఇవ్వాలన్నా చాలా తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేసి ఇచ్చేయొచ్చు. ఈ రోజు ప్రేమికుల రోజు. ప్రియమైన వారికి, జీవిత భాగస్వామిలకు బహుమతులు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలో కాస్త విలువైన బహుమతిని ఇవ్వాలన్నా కూడా ఇవి బెస్ట్ ఆప్షన్స్.

Amazon Offers: కాస్ట్‌లీ ఫోన్లపై బంపర్ ఆఫర్స్.. ఏకంగా 39శాతం వరకూ డిస్కౌంట్.. లిస్ట్‌లో యాపిల్ ఐఫోన్ కూడా..
Apple Iphone
Follow us on

హైఎండ్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? యాపిల్ వంటి బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు వినియోగించాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే ధర ఎక్కువని వెనక్కి తగ్గుతున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్లో యాపిల్ ఐఫోన్లపై అదిరే డిస్కౌంట్ లభిస్తోంది. మీరు ఒకవేళ యాపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆశతో ఉంటే ఇదే సరైన సమయం. లేదా ఎవరికైనా గిఫ్ట్ గా యాపిల్ ఫోన్ ఇవ్వాలన్నా చాలా తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేసి ఇచ్చేయొచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, పోకో ఎక్స్ 6 స్మార్ట్ ఫోన్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఈ రోజు ప్రేమికుల రోజు. ప్రియమైన వారికి, జీవిత భాగస్వామిలకు బహుమతులు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలో కాస్త విలువైన బహుమతిని ఇవ్వాలన్నా కూడా ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఇంకెందుకు ఆలస్యం.. ఆయా ఫోన్లపై ఉన్న ఆఫర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 15 ప్రో..

ఐఫోన్ 15 ప్రో ప్రోమోషన్ టెక్నాలజీతో పాటు 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, టైటానియం ఫ్రేమ్ ను కలిగి ఉంది. ఇది ఏ17 ప్రో ఎస్ఓసీ 6-కోర్ సీపీయూని కలిగి ఉంది. ఐఫోన్ 15 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇది అద్భుతమైన చిత్ర నాణ్యత కోసం 7 ప్రో లెన్స్లను కలిగి ఉన్న ప్రో 48ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇది అమెజాన్లో కేవలం రూ.1,37,990 వద్ద లభిస్తుంది. దీని అసలు ధరతో పోల్చితే 5శాతం తక్కువ ధరకు ఇది లభ్యమవుతోంది. దీని నిల్వ సామర్థ్య 256జీబీ ఉంటుంది. ముందు వైపు కెమెరా 12ఎంపీ ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ..

ఈస్మార్ట్ ఫోన్లో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ వైడ్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ముందు కెమెరా 10ఎంపీ సెల్ఫీ షూటర్. 50ఎంపీ కెమెరా 3రెట్ల ఆప్టికల్ జూమ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 2200 ఎస్ఓసీ ప్రాసెసర్ నుంచి శక్తిని పొందుతుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ని అనుమతిస్తుంది. దీనిని మీరు 39శఆతం తగ్గింపుతో రూ. 48,999కే అమెజాన్లో కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ 15..

ఈ స్మార్ట్ ఫోన్లో 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీ డిస్ప్లేతో పాటు ముందు డైనమిక్ ఐలాండ్ తొ వస్తుంది. 5-కోర్ జీపీయూ, ఏ16 బయోనిక్ చీప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది.. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, ఇందులో 48ఎంపీ ప్రధాన కెమెరా, 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఐఫోన్ 15 గరిష్టంగా 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఆఫర్ చేస్తుంది. అమెజాన్లో ఈ స్మార్ట్ ఫోన్ పై 14 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది.

యాపిల్ ఐఫోన్ 14..

ఈ స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీ డిస్ ప్లేను కలిగి ఉంది. 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది. 12ఎంపీ డ్యూయల్ కెమెరా, 12ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సహా అధునాతన కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఇది మృదువైన పనితీరు కోసం 5-కోర్ జీపీయూతో ఏ15 బయోనిక్ చిప్తో వస్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ 56 సెల్యులార్ కనెక్షన్ను కూడా పొందుతుంది. అమెజాన్లో ఈ ఫోన్ పై 17 శాతం తగ్గింపు ఉంటుంది.

పోకో ఎక్స్‌6 5జీ..

ఈ స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల 1.5కే ఓఎల్ఈడీ 12-బిట్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. 12జీబీ ర్యామ్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూని కూడా కలిగి ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది, ఇందులో 64ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మీరు అమెజాన్లో 26 శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ను పొందవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..