ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడుతున్నాయి. ప్రతీఏటా డిస్కౌంట్స్‌తో, ఊహకందని ఆఫర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ఈకామర్స్ సైట్స్ తాజాగా మళ్లీ ఆఫర్ల పండుగకు తెర తీస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వచ్చి చేరుతోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సిద్ధమవుతోంది.
తర్వలోనే ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు అమెజాన్ సూచనప్రాయంగా తెలిపింది. అమెజాన్ వెబ్‌సైట్‌తో పాటు, యాప్‌లో ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న తేదీపై మాత్రం అమెజాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం మాత్రం అక్టోబర్ 1వ తేదీ నుంచి సేల్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ పలు రకాల భారీ ఆఫర్లతో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో వస్తువులు కొనుగోలు చేసే యూజర్లకు ఎస్‌బీఐ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్ మొదలు, టీవీలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, అలెక్సా వంటి డివైజ్‌లపై భారీ డిస్కౌంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక తొలిసారి అమెజాన్ నుంచి వస్తువులను ఆర్డర్ చేసేవారికి వెల్‌కమ్ రివార్డు అందిస్తామని అమెజాన్ ప్రకటించింది.
ఐకూ జెడ్7 ప్రో, హానర్ 90 ప్రో ఫోన్‌లతో పాటు సామ్‌సంగ్ ఎం34, వన్‌ప్లస్ నార్డ్ సీఈ3, రియల్‌మీ 60 5జీ ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు అమెజాన్ వెబ్‌సైట్‌లో తెలిపింది. ఇక ఐఫోన్ పాత మోడల్స్‌పై ఈ సేల్‌లో భారీగా డిస్కౌంట్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఎఫ్‌ఈ స్మార్ట్ ఫోన్ ఈ సేల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మిడ్ రేంజ్‌లో వస్తున్న సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్34 5జీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ, ఐకూ జెడ్7ఎస్, టెక్నో పోవా 5 ప్రో వంటి స్మార్ట్ ఫోన్‌లపై కూడా ఈ సేల్‌లో మంచి డీల్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సేల్‌లో భాగంగా నో కాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా మరికొన్ని ఆఫర్లు ఇవ్వనున్నారు. ప్రైమ్ మెంబర్స్‌కి ఒక రోజు ముందు నుంచే ఆఫర్స్ ప్రారంభంకానున్నాయి. ఇక ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై కూడా భారీగా డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఈ ప్రొడక్ట్స్‌పై ఏకంగా 75 శాతం డిస్కౌంట్ లభించనున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు, అలెక్సా, ఫైర్ టీవీ వంటి వాటిపై 55 శాతం డిస్కౌంట్ లభించనున్నట్లు సమాచారం. ఈ సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..