Amazon: అమెజాన్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా.? ఏయే ప్రాడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ ఉండనుందంటే..
ఇదిలా ఉంటే తాజాగా మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 పేరుతో సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ కూడా అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ తన సేల్ అక్టోబర్ 15వ తేదీతో ముగియనుందని ప్రకటించినప్పటికీ, అమెజాన్ మాత్రం సేల్ ముగింపు తేదీ ఎప్పుడన్నదానిపై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ సేల్ ప్రారంభం కానుందని...

పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఈ కామర్స్ సైట్స్. ప్రతీ ఏటా దసరా సమయంలో ఈ కామర్స్ సైట్స్ భారీ సేల్ నిర్వహిస్తాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ సేల్‌కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్ ఉండనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 పేరుతో సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ కూడా అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ తన సేల్ అక్టోబర్ 15వ తేదీతో ముగియనుందని ప్రకటించినప్పటికీ, అమెజాన్ మాత్రం సేల్ ముగింపు తేదీ ఎప్పుడన్నదానిపై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ సేల్ ప్రారంభం కానుందని ప్రకటించిన అమెజాన్.. ఏయే ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్స్ ఇవ్వనుందన్న దానిపై కొన్ని వివరాలను విడుదల చేసింది. ఇంతకీ ఈ సేల్‌లో ఎలాంటి ఆఫర్స్ ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ప్రైమ్ మెంబర్స్‌కి ఒక రోజు ముందే సేల్ అందుబాటులోకి రానుంది. అలాగే ఉచితంగా వన్‌డే ఫ్రీ డెలవరీని సైతం అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరాణలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇక ఈ సేల్‌లోనే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు సామ్‌సంగ్, రియల్‌మీ, రెడ్‌మీ తమ కొత్త ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి.
వీటితో పాటు యాపిల్, వన్‌ప్లస్, రియల్‌మీ, సామ్‌సంగ్ వంటి స్మార్ట్ ఫోన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. అయితే ఈ ఫోన్‌లపై ఎంత తగ్గింపు ఇవ్వనున్నారన్నదానిపై ఇప్పటి వరకు అమెజాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెజాన్ అలెక్సా డివైజ్‌లతో పాటు, ఫైర్ టీవీ స్టిక్, కిండ్లే, అలెక్సా స్మార్ట్ హోమ్ డవైజ్‌లపై ప్రత్యేక డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. వీటితో పాటు సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11 ఆర్, ఐఫోన్ 3, ఐకూ నియో 7 ప్రో, మోటోరొలా రేజర్ 40 అల్ట్రా, రియల్‌మీ నార్జో 60 ప్రో, ఐకూ జెడ్ 7 ప్రో వంటి ఫోన్‌లపై అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభించనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




