- Telugu News Photo Gallery Technology photos Vivo cuts price of vivo y02t, vivo y16 smartphone, check here for features and price details Telugu Tech News
Vivo Smartphone: రెండు స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించిన వివో.. రూ. 9 వేలకే మంచి ఫీచర్స్
పండుగ సీజన్ నేపథ్యంలో కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ మొదలు అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంటస్‌ను అందిస్తున్నారు. అమెజాన్ మొదలు ఈ కామర్స్ వరకు అన్ని రకాల ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్స్ డిస్కౌంట్స్‌ను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే బిగ్ బిలియన్ డేస్‌ను నిర్వహించననున్నాయి. ఇదిలా ఉంటే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సైతం తమ స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది..
Updated on: Sep 28, 2023 | 7:11 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కస్టమర్స్‌కి శుభవార్త చెప్పింది. తమ కంపెనీకి చెందిన రెండు ఫోన్‌ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వివో వై16, వివో వై02టీ ఫోన్‌ల ధరలను తగ్గిస్తున్నట్లు వివో అధికారికంగా ప్రకటించింది.

తగ్గించిన ధరల తర్వాత వివో వై16 బేస్ వేరియంట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 10,499గా ఉండనుంది. ఇక 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 11,999గా ఉంది. ఇక వివోవై02 టీ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999కి లభించనుంది.

ఇక ఈ ఫోన్‌ల ఫీచర్స్ విషయానికొస్తే.. వివో వై 16, వివో వై20 టీ రెండు ఫోన్స్‌లోనూ మీడియా టెక్ హీలియో పీ35 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ను అందించారు. 10 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే వివో వై 16 స్మార్ట్ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే వివో వై02 టీ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి ఈ ఆప్షన్ వర్తిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.




