Tiny Batteries: ఎంఐటీ ఇంజినీర్ల అద్భుత ఆవిష్కరణ.. అతి చిన్న బ్యాటరీలతో ఆ సమస్యలు ఫసక్

|

Aug 17, 2024 | 5:00 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా మానవుల సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఎప్పుడూ పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఎంఐటీ ఇంజినీర్లు ఇటీవల రూపొందించిన ఒక చిన్న బ్యాటరీ మానవ శరీరంలో డ్రగ్ డెలివరీ కోసం రూపొందించిన అతి చిన్న బ్యాటరీ రోబోటిక్స్‌కు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ పైప్‌లైన్‌లలో లీక్‌లను గుర్తించడం వంటి ఇతర సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరిస్తున్నారు.

Tiny Batteries: ఎంఐటీ ఇంజినీర్ల అద్భుత ఆవిష్కరణ.. అతి చిన్న బ్యాటరీలతో ఆ సమస్యలు ఫసక్
Microbatteries
Follow us on

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా మానవుల సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఎప్పుడూ పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఎంఐటీ ఇంజినీర్లు ఇటీవల రూపొందించిన ఒక చిన్న బ్యాటరీ మానవ శరీరంలో డ్రగ్ డెలివరీ కోసం రూపొందించిన అతి చిన్న బ్యాటరీ రోబోటిక్స్‌కు కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్యాస్ పైప్‌లైన్‌లలో లీక్‌లను గుర్తించడం వంటి ఇతర సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరిస్తున్నారు. ఈ కొత్త బ్యాటరీ 0.1 మిల్లీమీటర్ల పొడవు, 0.002 మిల్లీమీటర్ల మందం. అంటే ఇంచుమంచి మన జుట్టు సైజ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ గాలి నుంచి ఆక్సిజన్‌ను సంగ్రహిస్తుంది. అలాగే జింక్‌ను ఆక్సీకరణ చేయడానికి ఒక వోల్ట్ వరకు సంభావ్యతతో కరెంట్‌ను సృష్టిస్తుందని పరిశోధకులువెల్లడిస్తున్నారు. చిన్న సర్క్యూట్, సెన్సార్ లేదా యాక్యుయేటర్‌కు శక్తినివ్వడానికి ఇది సరిపోతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐటీ ఇంజినీర్ల తాజా ఆవిష్కరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎంఐటీ ఇంజినీర్లు రూపొందించిన బ్యాటరీ రోబోటిక్స్‌కు చాలా ఉపయోగపడుతుందని ఎంఐటీ ప్రొఫెసర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ రైటర్ మైఖేల్ స్ట్రానో చెబుతున్నారు. ముఖ్యంగా టైనీ బ్యాటరీల ద్వారా రోబోటిక్ ఫంక్షన్‌లను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న సైజ్ రోబోలకు శక్తిని అందించడానికి టైనీ బ్యాటరీలు ఉపయోగపడతాయి. రోబోట్‌లు ఎల్లప్పుడూ లేజర్ లేదా మరొక కాంతితో ఉండాలి. అటువంటి పరికరాలను “మారియోనెట్స్” అని పిలుస్తారు. ఎందుకంటే అవి అవుటర్ యూనిట్ ద్వారా నియంత్రిస్తారు. ఈ చిన్న పరికరాలలో బ్యాటరీ వంటి పవర్ సోర్స్‌ను ఉంచడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. మారియోనెట్ సిస్టమ్‌లకు నిజంగా బ్యాటరీ అవసరం లేదు. ఎందుకంటే అవి బయటి నుంచి అవసరమైన శక్తిని పొందుతున్నాయని స్ట్రానో చెప్పారు. అయితే మనం యాక్సెస్ చేయలేని ఖాళీల్లోకి ఒక చిన్న రోబోట్ ప్రవేశించాలంటే దానికి ఎక్కువ స్థాయి స్వయంప్రతిపత్తి ఉండాలి. బయటి ప్రపంచానికి అనుసంధానించని వాటికి బ్యాటరీ తప్పనిసరిగా కావాలి. అందువల్ల టైనీ బ్యాటరీలు చాలా బాగా ఉపయోగపడుతాయని చెబుతున్నారు.

ఈ అధ్యయనంలో పరిశోధకులు తమ బ్యాటరీని అవుటర్ యూనిట్‌కు కనెక్ట్ చేసేందుకు ఒక వైర్‌ను ఉపయోగించారు. ముఖ్యంగా మానవుని శరీరంలోని సమస్యలను చెక్ చేసేందుకు ఈ రోబోలు చాలా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టార్గెటెడ్ ప్రాంతంలో ఇన్సులిన్ వంటి మందును విడుదల చేయవచ్చని పేర్కొంటారు. మానవ శరీరంలో ఉపయోగం కోసం పరికరాలు బయో కాంపాజిబుల్ పదార్థాలతో తయారు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పరిశోధకులు బ్యాటరీ ఓల్టేజ్‌ను పెంచడానికి కూడా పని చేస్తున్నారు. ఈ పరిశోధనకు యూఎస్ ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ, నేషనల్ సైన్స్ ఫౌండేషన్, మ్యాథ్‌వర్క్స్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ నిధులు సమకూర్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి