Facebook Security: ‘మీ అకౌంట్ ప్రమాదంలో ఉంది’ అంటూ మెసేజ్‌లు, లింక్‌లు.. నమ్మారో అంతే సంగతులు.. ఫేక్ బుక్ వినియోగదారులూ తస్మాత్ జాగ్రత్త!

|

May 09, 2023 | 4:00 PM

వెరిఫైడ్ యూజర్లమంటూ ఓ లింక్ పంపడం, దానిని క్లిక్ చేయగానే వ్యక్తిగత్ డేటా తో బ్యాంకు వివరాలను తస్కరించి లూటీలకు పాల్పడుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా నిపుణుడు మాట్ నవారా బ్లూ టిక్‌తో ధృవీకరించబడిన ఒక ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ వివరించారు.

Facebook Security: ‘మీ అకౌంట్ ప్రమాదంలో ఉంది’ అంటూ మెసేజ్‌లు, లింక్‌లు.. నమ్మారో అంతే సంగతులు.. ఫేక్ బుక్ వినియోగదారులూ తస్మాత్ జాగ్రత్త!
Meta's Fb
Follow us on

అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక ఎన్ని మేలులు చేస్తుందో.. అదే రీతిలో ప్రమాదాలను కొని తెస్తోంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటా దొంగిలించడంతో పాటు బ్యాంకు ఖాతాలను కూడా కొల్లగొడుతున్నారు. ఎన్నిరకాల సెక్యూరిటీలు పెట్టుకున్న నేరగాళ్లు ఏదో రకంగా చొరబడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫారం మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్ వేదికగా నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా వెరిఫైడ్ ప్రోఫైల్స్ పేరిటే నేరగాళ్లు తెగబడుతున్నారు. సాధారణంగా వెరిఫైడ్ ప్రోఫైల్స్ అంటే అందరికీ కాస్త నమ్మకం ఉంటుంది. అటువంటి ప్రోఫైల్స్ కి ఫేక్ క్రియేట్ చేసి మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్లూ టిక్ మార్క్ తో..

ట్విట్టర్ లో ఉండే బ్లూటిక్ మాదిరిగానే మెటా యాజమాన్యంలోని ఫేస్ బుక్ కూడా వెరిఫైడ్ ప్రోఫైల్స్ కి బ్లూ టిక్ మార్క్ ఇస్తోంది. వినియోగదారుల అడ్రస్ ప్రూఫ్ వంటివి అప్ లోడ్ చేయడం ద్వారా ఈ బ్లూ టిక్ వస్తుంది. అయితే ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. కానీ కొంతమంది వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు వెరిఫైడ్ ప్రోఫైల్స్ ను వినియోగించుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల డబ్బును కాజేస్తున్నారు. వెరిఫైడ్ యూజర్లమంటూ ఓ లింక్ పంపడం, దానిని క్లిక్ చేయగానే వ్యక్తిగత్ డేటా తో బ్యాంకు వివరాలను తస్కరించి లూటీలకు పాల్పడుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా నిపుణుడు మాట్ నవారా బ్లూ టిక్‌తో ధృవీకరించబడిన ఒక ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ వివరించారు. ఈ ఫేక్ అకౌంట్లకు మెటా ఎలా వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

ఈ స్క్రీన్ షాట్ లో ఏముందంటే..

స్కామర్లు ఫేక్ వెరిఫైడ్ యూజర్ ఐడీలను క్రియేట్ చేసుకొని వినియోగదారులకు మెసేజ్ లు పంపిస్తున్నారు. మెటా యాడ్స్ పేరిట ఉన్న ఓ ప్రోఫైల్ నుంచి ఈ విధంగా మెసేజ్ లు పంపుతున్నారు. మీ ఫేస్ బుక్ అకౌంట్ సెక్యూరిటీ ప్రమాదంలో ఉందని, వెంటనే మీకివ్వబడిన లింక్ ద్వారా సెక్యూరిటీ సెటప్ చేసుకోవాలంటూ హెచ్చరికలు పంపతున్నారు. దీంతో వినియోగదారులు కంగారు పడి, ఆ లింక్ లను క్లిక్ చేసి నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు. ప్రొఫైల్, పోస్ట్ చట్టబద్ధంగా కనిపిస్తున్నప్పటికీ, వినియోగదారులు వాటిని తప్పక నివారించాలి. ఇది వినియోగదారులను మాల్‌వేర్‌కు మళ్లించే స్కామ్ ప్రకటన. మాల్వేర్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, అది డేటాను దొంగిలించవచ్చు లేదా సిస్టమ్‌కు యాక్సెస్‌ని పొందవచ్చు, దీని వలన వినియోగదారు హాని కలిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..