Airtel Broadband: ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు!

Airtel Broadband: ప్రస్తుతం ప్రతి ఒక స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్‌ తప్పనిసరి అయిపోయింది. అయితే అప్పుడప్పుడు పలు టెలికం కంపెనీల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది. ..

Airtel Broadband: ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు!

Updated on: May 07, 2022 | 10:01 AM

Airtel Broadband: ప్రస్తుతం ప్రతి ఒక స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్‌ తప్పనిసరి అయిపోయింది. అయితే అప్పుడప్పుడు పలు టెలికం కంపెనీల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతుంటుంది. దీని వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక ఎయిర్‌టెల్ వినియోగదారులు కూడా ఇలాంటి సయస్యనే ఎదుర్కొన్నారు. భారతదేశం (India) అంతటా ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల్లో (Broadband Services) అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా మిలియన్ల మంది వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. మొబైల్‌, డెస్క్‌టాప్‌ (Mobile and Desktop)రెండింటిలోనూ ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేయలేకపోయినందున శుక్రవారం రాత్రి ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు IANS నివేదించింది.

వెబ్‌సైట్‌ అవుట్‌టేజ్‌ మానిటరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ DownDetector.com ప్రకారం.. అంతరాయం దేశ వ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులపై పడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, జైపూర్‌, ఇతర నగరాల్లోని వినియోగదారులకు ఈ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులలో 39 శాతం మందికి సిగ్నల్‌ లేకుంటే, 32 శాతం మందికి మొబైల్‌ ఇంటర్నెట్‌సమస్యలున్నాయి. 29 శాతం మంది బ్లాక్‌ అవుట్‌ను ఎదుర్కొన్నారని నివేదిక పేర్కొంది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Post Office: పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతాను ఎవరెవరు తెరవవచ్చు.. వడ్డీ రేటు ఎంత..? పూర్తి వివరాలు

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. తాజా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!