Airtel Data Pack: మరో నయా డేటా ప్యాక్ ప్రకటించిన ఎయిర్‌టెల్.. వారే అసలు టార్గెట్..
తాజాగా ఎయిర్‌టెల్ తక్కువ ధరలో మరో డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.99కే అపరిమిత 5జీ డేటాతో ఓ ప్యాక్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ఒకే రోజు అధిక డేటా కావాలనుకునే వారికి ఈ ప్యాక్ అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్యాక్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. ముఖ్యంగా టెలికాం మార్కెట్‌లో జియో ఎంట్రీ తర్వాత డేటా ప్యాక్‌లు తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. జియో దెబ్బకు అన్ని కంపెనీలు తమ డేటా ప్యాక్‌ల ధరలను తగ్గించాయి. అలాగే కొత్తకొత్త ప్యాక్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ తక్కువ ధరలో మరో డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.99కే అపరిమిత 5జీ డేటాతో ఓ ప్యాక్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ఒకే రోజు అధిక డేటా కావాలనుకునే వారికి ఈ ప్యాక్ అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్యాక్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
రూ.99 ప్యాక్ వివరాలివే
ఎయిర్‌టెల్ తాజా డేటా ప్యాక్ ఒక రోజు చెల్లుబాటుతో వస్తుంది. ఇది స్వతంత్ర ప్యాక్ కాదు. కాబట్టి, దీనికి యాక్టివ్ బేస్ ప్లాన్ అవసరం. కాబట్టి వినియోగదారులు తప్పనిసరిగా ఏదో ఎయిర్‌టెల్ యాక్టివ్ ప్లాన్‌లో ఉండాలి. ఇలాంటి వారు రూ.99తో రీచార్జ్ చేసుకుంటే 30 జీబీ డేటా వస్తుంది. 30 జీబీ అనంతరం డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. కాబట్టి ఈ ప్లాన్ ద్వారా ఒక్కరోజులోనే అధిక డేటా కావాలని కోరుకునేవారికి అనువుగా ఉంటుంది. అంతేకాదు ఎయిర్‌టెల్ వినియోగదారులకు వివిధ ప్రీపెయిడ్ యాక్టివ్ బేస్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి మరియు ఇది కస్టమర్ నుంచి కస్టమర్‌కు మారుతూ ఉంటుంది. అలాగే ఎయిర్‌టెల్ రూ.98 ప్లాన్ ఇది ప్రస్తుత ప్లాన్ కొనసాగే వరకు చెల్లుబాటుతో వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 5 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే రూ.58 ప్లాన్ 3 జీబీ డేటాను అందజేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..