Acer fitness bike: సైకిల్ తొక్కితే చాలు.. సింపుల్‌గా మొబైల్, ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసేయొచ్చు.. అదెలాగంటే.?

| Edited By: Anil kumar poka

Jan 05, 2023 | 7:03 PM

ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ఏసర్(Acer) కొత్త తరహా ఫిట్ నెస్ బైక్ ని ప్రకటించింది. దీనిపై సైక్లింగ్ చేయడం ద్వారా సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటివి చార్జ్ చేసుకునేందుకు అవసరం అయిన విద్యుత్ ను అది ఉత్పత్తి చేస్తుంది.

Acer fitness bike: సైకిల్ తొక్కితే చాలు.. సింపుల్‌గా మొబైల్, ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసేయొచ్చు.. అదెలాగంటే.?
Acer Bike
Follow us on

సైక్లింగ్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని ఎంతమందికి తెలుసు? మన పాతకాలపు సైకిళ్లను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే ఇది అర్థమవుతుంది. పాతకాలపు సైకిల్ కి ముందు వైపు హ్యాండిల్ వద్ద ఓ లైట్ ఉంటుంది. అది వెనుకవైపు టైర్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు అది లైట్ ను వెలిగిస్తుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ఏసర్(Acer) కొత్త తరహా ఫిట్ నెస్ బైక్ ని ప్రకటించింది. దీనిపై సైక్లింగ్ చేయడం ద్వారా సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటివి చార్జ్ చేసుకునేందుకు అవసరం అయిన విద్యుత్ ను అది ఉత్పత్తి చేస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సైక్లింగ్ తో ఆరోగ్యం..

సైకిల్ అనే దానిని చాలా మంది మరిచిపోయారు. మోటార్ వెహికల్స్ వచ్చాక స్కూల్ విద్యార్థుల తప్ప ఎవరూ వినియోగించడం లేదు. కానీ రోజూ సైక్లింగ్ చాలా ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతుంటారు. రోజూ చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఉండేటట్లు చూసుకోమని సలహా ఇస్తుంటారు. అందుకోసం చాలా మంది జిమ్ లకు వెళ్తుంటారు. మరికొంత మంది ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఏసర్ eKinekt BD3 పేరుతో కొత్త ఫిట్ నెస్ బైక్ ను లాస్ వెగాస్‌లోని CES 2023లో ప్రకటించింది. స్మార్ట్ డెస్క్, పెలోటాన్ బైక్ రెండు కాన్సెప్ట్ లను కలిపి దీనిని ఆవిష్కరించింది.

ఇలా పనిచేస్తుంది..

ఈ ఫిట్ నెస్ బైక్ పై 60RPM వద్ద స్థిరంగా ఒక గంట సైక్లింగ్ చేస్తే 75 వాట్ల ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. దీనిలో ఓ ఎల్ సీడీ డిస్ ప్లే, స్మార్ట్ ఫోన్ యాప్ సాయంతో దీనిని వినియోగించుకోవచ్చు.
దీనిలో రెండు యూఎసీ బీ పోర్టులు ఉంటాయి. ఫోన్, ల్యాప్ టాప్ వంటివి దీని ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్ కి బ్యాగ్ తగిలించుకునేందుకు ఒక హుక్, వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు హోల్డర్ ఉంటాయి. దీనిలో వర్కింగ్ మోడ్, స్పోర్ట్ మోడ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎప్పటి నుంచి అందుబాటులో అంటే..

Acer eKinekt BD3 వచ్చే జూన్‌ నుంచి మార్కెట్ లోకి రానుంది. తొలుత ఉత్తర అమెరికా, యూరోప్‌లో లభించనుంది. ఉత్తర అమెరికా దీని ధర $999, యూరోప్ లో EUR 999 ఉండే అవకాశం ఉంది.

 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..