Vastu Tips: పొరపాటున కూడా వంట గదిలో ఇవి ఉండకూడదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే

|

Jul 17, 2024 | 6:51 PM

ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లాభాలు కలుగుతాయన్న దానికి ఎంత విశ్వాసం ఉందో, కొన్ని రకాల వస్తువుల వల్ల ఇబ్బందులు తప్పవని కూడా నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వంట గదికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వంట గదిలో కొన్ని రకాల వస్తువులు ఉండడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు...

Vastu Tips: పొరపాటున కూడా వంట గదిలో ఇవి ఉండకూడదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే
Kitchen
Follow us on

భారతీయులను, వాస్తును విడదీసి చూడలేని పరిస్థితి. చాలా మంది వాస్తును విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణమనే ఆలోచన రాగానే మొదట వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. నిపుణుల సూచనల ఆధారంగానే ఇంటి నిర్మాణాన్ని చేపడుతారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలోనూ వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు.

ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లాభాలు కలుగుతాయన్న దానికి ఎంత విశ్వాసం ఉందో, కొన్ని రకాల వస్తువుల వల్ల ఇబ్బందులు తప్పవని కూడా నమ్ముతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వంట గదికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వంట గదిలో కొన్ని రకాల వస్తువులు ఉండడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కిచెన్‌లో ఉండకూడని ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన పాత్రలు ఉండకూడదు. మనలో చాలా మంది కొన్ని పాత్రలు సగం విరిగిన వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వస్తువులు వంట గదిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయని చెబుతున్నారు.

* ఇక వంట గదిలో చాలా వరకు డబ్బాలు, పాత్రలు ఉంటాయి. అయితే వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉంచకూడదు. దీని అర్థం వంట గదిలో అవసరమైన వస్తువులు నిండుకోకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయని అంటున్నారు. ఇవి సమృద్ధి లేకపోవడాన్ని సూచిస్తాయని అంటున్నారు. అందుకే డబ్బాలు ఎప్పుడూ నిండా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇంట్లో నిరూపయోగంగా ఉన్న వస్తువులను, పాడైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వంట గదిలో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉపయోగంలో ఉన్న గృహోపకరణాలను బయటపడేయాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పని చేయని కుక్కరలు, రైస్‌ కుక్కర్లు, ఫ్రిజ్‌లు, మీక్సీలను వంట గదిలో లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లో పాడైన ఆహారం లేకుండా చూసుకోవాలి. బూజు పట్టిన ఆహారాన్ని వంట గదిలో పెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లో చెత్త డబ్బాను ఉంచకూడదని సూచిస్తున్నారు.

* వంట గదిలో చాక్స్, కత్తులు, కత్తెరలు, కత్తిపీటలు ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే వీటిని వంట గదిలో ఓపెన్‌ ప్లేస్‌లో అస్సలు పెట్టకూడదు. వాటిని నిర్దేశిత ప్రదేశంలోనే ఉంచాలి. వీటిని ఒకవేల ఓపెన్‌ ప్లేస్‌లో ఉంచితే.. ఆర్థిక అస్థిరతకు కారణమవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..