AI: కొంప ముంచిన ఏఐ.. పని ఈజీ అవుతుందనుకుంటే, ఉద్యోగమే పోయింది..

|

Nov 23, 2023 | 7:32 AM

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరాడో కేంద్రంగా న్యాయపరమైన సేవలను అందించే 'బేకర్‌ లా గ్రూప్‌' జకారియా క్రాబిల్‌ అనే సంస్థలో క్రాబిల్‌ అనే ఓ యువ న్యాయవాధి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రాబిల్‌కు ఒక పని అప్పజెప్పారు. కస్టమర్ల కేసుల్ని కులంకషంగా రీసెర్చ్‌ చేసి.. గతంలో ఇదే తరహా కేసుల్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా డ్రాఫ్ట్‌ని తయారు చేయాలనే టాస్క్‌ ఇచ్చారు...

AI: కొంప ముంచిన ఏఐ.. పని ఈజీ అవుతుందనుకుంటే, ఉద్యోగమే పోయింది..
Artificial Intelligence
Follow us on

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రాకతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దాదాపు ప్రతీ రంగంలో ఏఐ విఇనయోగం అనివార్యంగా మారింది. ఎన్నో ప్రశ్నలకు ఏఐ సులువుగా సమాధానం చెప్పేస్తోంది. అయితే ఇదే టెక్నాలజీ ఇప్పుడు ఉద్యోగుల అస్థిత్వాన్నే ప్రశ్నగా మార్చేస్తోంది. ఏఐ ఉపయోగించడం వల్ల తాజాగా ఓ యువ న్యాయవాది ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సంఘటన అమెరికాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరాడో కేంద్రంగా న్యాయపరమైన సేవలను అందించే ‘బేకర్‌ లా గ్రూప్‌’ జకారియా క్రాబిల్‌ అనే సంస్థలో క్రాబిల్‌ అనే ఓ యువ న్యాయవాధి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రాబిల్‌కు ఒక పని అప్పజెప్పారు. కస్టమర్ల కేసుల్ని కులంకషంగా రీసెర్చ్‌ చేసి.. గతంలో ఇదే తరహా కేసుల్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా డ్రాఫ్ట్‌ని తయారు చేయాలనే టాస్క్‌ ఇచ్చారు. పనులను వెంటనే పూర్తి చేయాలని బాస్‌ డెడ్‌లైన్‌ కూడా ఇచ్చాడు.

దీంతో ఒత్తిడిగా ఫీలయిన యంగ్‌ లాయర్‌, పని భారాన్ని తగ్గించుకునేందుకు, చాట్‌ జీపీటీని ఆశ్రయించాడు. కస్టమర్ల కేసుల్ని రీసెర్చ్‌ చేసి డ్రాఫ్ట్‌ను తయారు చేసేందుకు చాట్‌ జీపీటీ ఉపయోగించాడు. చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించింది బాస్‌కు అప్పగించాడు. అనంతరం ఫైల్స్‌నలో కొలరాడో కోర్టులో సమర్పించారు. ఫైల్‌ను పరిశీలించిన న్యాయ స్థానానికి ఈ డాక్యుమెంట్‌ చాట్‌జీపీటీని వినియోగించి తయారు చేసినట్లు గుర్తించింది.

అందులో పేర్కొన్ని సమాధానాల్లో తప్పులు ఉన్నాయని, ఆ సమాధానాలు సరైనవి కాదని తెలిసి కూడా కేసుల్లోని డ్రాఫ్ట్‌లను తయారు చేశాడు. ఇదే విషయాన్ని న్యాయమూర్తి ప్రశ్నించగా క్రాబిల్‌ న్యాయమూర్తి ముందు తప్పును అంగీకరించాడు. దీంతో బేకర్‌ లా గ్రూప్‌ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేసింది. మానవ మేథస్సును ఏఐ ఎప్పటికీ రీప్లేస్‌ చేయలేదని తెలిపేందుకు ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది. అయితే ఉద్యోగం కోల్పోయినా.. న్యాయవాదుల సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని క్రాబిల్ విశ్వసిస్తున్నాడు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..