Air view: గాలి నాణ్యతను కొలిచే కొత్త ఫీచర్.. గూగుల్ మ్యాప్స్ నయా ఫీచర్ అదిరిందిగా..!

ఆధునిక కాలంలో మానవులను వేధిస్తున్న సమస్యలలో కాలుష్యం ఒకటి. పెరుగుతున్న జనాభా, వాహనాల వినియోగం, చెట్లను నరికివేయడం ఇలా అనేక కారణలు దీని వెనుక ఉన్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో స్వచ్ఛమైన గాలి లభించడం లేదు. నగరాలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది.

Air view: గాలి నాణ్యతను కొలిచే కొత్త ఫీచర్.. గూగుల్ మ్యాప్స్ నయా ఫీచర్ అదిరిందిగా..!
Google Maps New Features
Follow us
Srinu

|

Updated on: Nov 25, 2024 | 8:10 PM

దేశ రాజధాని ఢిల్లీలో మరింత జఠిలంగా మారింది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయుకాలుష్య శాతాన్ని గుర్తించేందుకు ఎయిల్ వ్యూ అనే ఫీచర్ ను గూగుల్ తీసుకువచ్చింది. గూగుల్ మ్యాప్స్ లోని ఈ ఫీచర్ ద్వారా వివిధ నగరాలలో ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 491 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో గూగుల్ ఈ ఎయిర్ వ్యూ అనే ఫీచర్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా ఆయా నగరాల అధికారులకు గాలి నాణ్యత శాతం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం సాగించవచ్చు. ఏఐ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

గాలి నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించే కొలమానాన్నే ఏక్యూఐ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఆయా ప్రాంతాలలో గాలి పీల్చడం వల్ల కలిగే ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఏక్యూఐ అనేది 0 నుంచి 500 మధ్య ఉంటుంది. దీనిలో 0 నుంచి 50 పాయింట్ల మధ్య గాలి నాణ్యత ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 51 నుంచి 100 పాయింట్ల మధ్య ఉంటే సమూహాలలో శ్వాస తీసుకోవడానికి అవస్థలు కలుగుతాయి. 101 నుంచి 200 వరకూ ఉంటే పిల్లలు, ముసలివారితో పాటు ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారికి అసౌకర్యంగా ఉంటుంది. 201 నుంచి 400 వరకూ ఉన్న నగరాలలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. 401 నుంచి 500 మధ్య ఉండే ఆరోగ్య వంతులపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇటీవల ఢిల్లీలో 491 పాయింట్ల నమోదు కావడం అక్కడ వాయ కాలుష్యాన్ని తెలియజేస్తుంది.

ఇప్పటి వరకూ కొత్త ప్రదేశాలను పరిశీలించడానికి, దారి గురించి తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించేవారు. ఇప్పటి నుంచి గాలి నాణ్యతను తెలుసుకోవడానికి వాడవచ్చు. 150కి పైగా నగరాల్లో ఇన్ స్టాల్ చేసిన ఎయిర్ క్వాలిటీ సెన్సార్ల నెట్ వర్క్ ను ఉపయోగించి ఎయిర్ వ్యూ పనిచేస్తుంది. మౌలిక సదుపాయాలు లేని ప్రధాన పట్టణాలలో సహా పీఎం 2.5, పీఎం 10, కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ డైయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను కొలవడానికి యుటిలిటీ పోల్స్, కమర్షియల్ సైట్లు, అడ్మినిస్ట్రేషన్ భవనాలపై ఈ సెన్సార్లను ఏర్పాటు చేశారు. కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రత, తేమ తదితర వాటిని కూడా ఇవి కొలుస్తాయి. ఈ సెన్సార్లు సేకరించిన డేటా కచ్ఛితంగా ఉందని ఢిల్లీ, హైదరాబాద్ లలోని ఐఐటీ పరిశోధకులు నిర్ధారణ చేశారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..