Push Pull Trains: వందేభారత్‌కు దీటుగా సామాన్యుల కోసం సరికొత్త స్పీడ్‌ ట్రైన్‌.. ఉద్యోగుల కోసమే ప్రత్యేకం

| Edited By: Ram Naramaneni

Nov 01, 2023 | 10:08 PM

ముఖ్యంగా భారతీయ రైల్వేలు కూడా హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆవిష్కరణల శ్రేణికి తాజా జోడింపుగా పుష్-పుల్ రైళ్లను ప్రవేశపెట్టనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తాజా  ఆవిష్కరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Push Pull Trains: వందేభారత్‌కు దీటుగా సామాన్యుల కోసం సరికొత్త స్పీడ్‌ ట్రైన్‌.. ఉద్యోగుల కోసమే ప్రత్యేకం
Push Pull Train
Follow us on

భారతీయ రైల్వే తన మౌలిక సదుపాయాలను, ప్రయాణీకుల అనుభవాన్ని పెంపొందించడానికి నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. ముఖ్యంగా రైల్వే సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో కొత్త రైలు సర్వీసుల పరిచయం, స్టేషన్ పునరుద్ధరణలు, వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ (ఓఎస్‌ఓపీ) పథకం అమలు, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రం స్టాల్స్ ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేలు కూడా హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆవిష్కరణల శ్రేణికి తాజా జోడింపుగా పుష్-పుల్ రైళ్లను ప్రవేశపెట్టనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తాజా  ఆవిష్కరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆసియాలో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వేలు ప్రతిరోజూ 10 మిలియన్లకు పైగా ప్రయాణీకుల రవాణా అవసరాలను తీరుస్తుంది. వీరిలో చాలామంది పరిమిత ఆర్థిక వనరులతో తక్కువ ఆదాయ సమూహాల నుంచి ఉండే వారే ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి, వారి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి భారతీయ రైల్వేలు పుష్-పుల్ రైళ్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే రైలు సేవ పాట్నా-ముంబై మధ్య నడిపై అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఉద్యోగ అవకాశాలు, ప్రధాన పట్టణ కేంద్రాలలో మెరుగైన జీవితాన్ని కోరుకునే వ్యక్తులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే పుష్-పుల్ రైలు అంటే ఏమిటి? ఈ రైలు గురించి నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి చూద్దాం.

పుష్-పుల్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సమానమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. నాన్‌-ఏసీ విభాగంలో ఇది హై-స్పీడ్ రైలుగా అందరూ పేర్కొంటున్నారు. మెట్రో వ్యవస్థ మాదిరిగానే ఈ వినూత్న రైలు డిజైన్‌లో రెండు ఇంజన్‌లు ఉంటాయి. ఒకటి రైలు ముందు, మరొకటి వెనుక భాగంలో ఉన్నాయి. ఈ రెండు ఇంజన్‌లు రైలును ఒకే దిశలో నెట్టడానికి, లాగడానికి సహకరిస్తాయి. ప్రొపల్షన్ కోసం ఒక ఇంజిన్ మాత్రమే అవసరం.

ఇవి కూడా చదవండి

సంప్రదాయ నమూనాలతో పోలిస్తే రైలు వేగాన్ని పెంచే సామర్థ్యం ఈ డిజైన్‌కు సంబంధించిన ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి. ఇంకా ఇది మరిన్ని కోచ్‌లను జోడించడం ద్వారా రైలు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ విస్తరించిన సామర్థ్యం వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులు ఏకకాలంలో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా టిక్కెట్ లభ్యత సమస్యను గణనీయంగా తగ్గిస్తుంది. అదనంగా పుష్-పుల్ రైళ్లకు తక్కువ శక్తివంతమైన ఇంజన్లు అవసరమవుతాయి, తద్వారా భారతీయ రైల్వేల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. రెండు ఇంజన్లు ఉన్నప్పటికీ ఈ రైళ్లు ఒకే డ్రైవర్‌తో నడపవచ్చు. ఈ రైలు సాధారణ, స్లీపర్ తరగతులను కలుపుతూ మొత్తం 22 కోచ్‌లను కలిగి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. పుష్-పుల్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే మెరుగైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సౌకర్యాలను అందిస్తుంది. ఈ రైళ్లలో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి క్లోజ్డ్ వెస్టిబ్యూల్స్, ఫైర్ అలారం సిస్టమ్‌లు, టాక్-బ్యాక్ సిస్టమ్‌లతో పాటు ఇతర అధునాతన సౌకర్యాలు ఉంటాయి.