Reliance Jio Smart Glass: వర్చువల్ రియాలిటీతో జియో కొత్త స్మార్ట్ గ్లాస్.. కళ్ల ముందు సరికొత్త ప్రపంచం..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సంస్థ టెక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తిపై దృష్టి సారించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లు మాత్రమే కాక ల్యాప్ టాప్స్, బ్రాండ్ బాండ్ డివైజెస్, గేమింగ్ కంట్రోలర్స్, స్మార్ట్ ఫోన్లు వంటి వాటిని తీసుకొస్తోంది. అందులో భాగంగానే అత్యాధునిక జియో స్మార్ట్ గ్లాస్ ను ఆవిష్కరించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఐఎంసీ 2023 టెక్ ఈవెంట్లో దీనిని ప్రదర్శించింది. రెండు వెర్షన్లలో దీనిని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సంస్థ టెక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తిపై దృష్టి సారించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లు మాత్రమే కాక ల్యాప్ టాప్స్, బ్రాండ్ బాండ్ డివైజెస్, గేమింగ్ కంట్రోలర్స్, స్మార్ట్ ఫోన్లు వంటి వాటిని తీసుకొస్తోంది. అందులో భాగంగానే అత్యాధునిక జియో స్మార్ట్ గ్లాస్ ను ఆవిష్కరించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఐఎంసీ 2023 టెక్ ఈవెంట్లో దీనిని ప్రదర్శించింది. రెండు వెర్షన్లలో దీనిని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రిలయన్స్ జియో గ్లాసెస్..
సాధారణంగా మనం కళ్లద్దాలు చూస్తాం. సన్ గ్లాసెస్ ధరిస్తూ ఉంటాం. అచ్చం అలాగే కనిపించే స్మార్ట్ గ్లాసెస్ ఇవి. కేవలం 75గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అయితే అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఈ గ్లాసెస్ సొగసైన మెటాలిక్ ఫ్రేమ్ తో రెండు లెన్స్‌లు కలిగి ఉన్నాయి. మీరు యూఎస్బీ కేబుల్‌ని ఉపయోగించి ఈ గ్లాసెస్ ను మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఇది పరికరానికి పవర్ సోర్స్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే వైర్‌లెస్ కనెక్టివిటీకి మద్దతునిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే భవిష్యత్తు అప్ గ్రేడ్లలో ఇది ఉండవచ్చు. అయితే మీరు కనెక్ట్ చేసిన స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి జియో గ్లాస్ ను వర్చువల్ గా కంట్రోల్ చేయొచ్చు.
ఫీచర్లు ఇవి..
జియో గ్లాసెస్ మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను 100-అంగుళాల వర్చువల్ డిస్‌ప్లేగా మార్చగలగుతుంది. ఇది మీ కళ్ల ముందు గాలిలో తేలుతున్నట్లు కనిపించే స్క్రీన్‌ను సృష్టిస్తుంది. ప్రతి కంటికి 1080పిక్సల్స్ డిస్‌ప్లే లభిస్తుంది. జియో గ్లాస్ వేరు చేయగలిగిన ఫ్లాప్‌ను కలిగి ఉంది. ఫ్లాప్ ఆఫ్ చేస్తే ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) కంటెంట్‌ను ఆస్వాదించగలుగుతారు. అదే ఫ్లాప్ ఆన్‌తో, వినియోగదారులు వర్చువల్ రియాలిటీ (వీఆర్) కంటెంట్‌ను చూడగలుగుతారు. ఇది వాల్యూమ్ లేదా వర్చువల్ స్క్రీన్ బ్రైట్ నెస్ సర్దుబాటు చేయడానికి ట్రాక్‌ప్యాడ్ నియంత్రణలను కూడా కలిగి ఉంది. వీటితో పాటు, స్పేషియల్ ఆడియో కోసం పక్కల రెండు స్పీకర్లు ఉన్నాయి. మీరు వాయిస్ కాల్‌లకు కూడా హాజరు కావడానికి మైక్రోఫోన్‌ను కూడా కలిగి ఉంటాయి. జియో గ్లాస్ తో వినియోగదారులు మూడు గంటల రన్‌టైమ్‌ను పొందుతారని కంపెనీ పేర్కొంది. దీనిలో 4,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
జియో గ్లాస్ ధర, లభ్యత..
రిలయన్స్ జియో గ్లాస్ ని రెండు వెర్షన్లలో లాంచ్ చేస్తుంది. ఒకటి వినియోగదారుల కోసం కాగా.. రెండవది ఎంటర్ప్రైజెస్ కోసం. ఈ కొత్త జియో గ్లాస్ పరికరం ధర, లభ్యత వంటి వివరాలను రిలయన్స్ ఇంకా వెల్లడించలేదు. జియో స్మార్ట్ గ్లాస్‌ను ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి తీసుకురావచ్చని, రాబోయే రెండు నెలల్లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే టెస్సెరాక్ట్ వెబ్‌సైట్‌లో ఈ పరికరం ‘కమింగ్ సూన్’గా జాబితా చేయబడింది. ఇది ప్రస్తుతం దాని ప్లాట్‌ఫారమ్‌లో ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ముందస్తు యాక్సెస్ పొందడానికి ఆసక్తి ఉన్నవారు తమ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాని టెస్సెరాక్ట్ వెబ్‌సైట్ కోరింది. అయితే, మీరు ప్రారంభ యాక్సెస్ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయడానికి పేరు, వ్యాపార ఈ-మెయిల్, సంస్థ పేరు, మరిన్నింటితో సహా కొన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..