Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడికి భారీ గండం..! భూమికి తప్పిన ముప్పు.. నాసా సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే..?

2024 YR4 అనే గ్రహశకలం 2032లో భూమిని ఢీకొంటుందని ముందుగా అంచనా వేసిన నాసా, తాజా పరిశీలనల తరువాత ఆ అంచనాను మార్చింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గమనించిన దాని ప్రకారం, ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొనే అవకాశం ఉంది. అయితే, చంద్రుడి కక్ష్యపై ఎలాంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు.

చంద్రుడికి భారీ గండం..! భూమికి తప్పిన ముప్పు.. నాసా సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే..?
Yr4 Asteroid
Follow us
SN Pasha

|

Updated on: Apr 04, 2025 | 8:41 AM

భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తుందని, 2032లో అది భూమిని ఢీకొంటుందని కొన్ని నెలల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దాంతో 2032లో యుగాంతం తప్పదా? అంటూ చాలా మంది ఆందోళన చెందారు. తాజాగా నాసా తన శక్తివంతమైన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ను ఉపయోగించి.. ఈ 2024 వైఆర్‌4 అనే గ్రహశకలాన్ని పరిశీలించింది. ఈ పరిశీలన తర్వాత.. ఆ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే దిశలో రావడం లేదని, దాని దారిని మార్చకోని, చంద్రుడి వైపు దూసుకెళ్తోంది.. 2032లో అది చంద్రుడిని బలంగా ఢీ కొట్టే అవకాశం ఉందంటూ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వైఆర్‌4 అనే గ్రహశకలం ఏకంగా పది అంతస్థుల భవనం అంత భారీ సైజులో ఉంటుందని అంచనా వేశారు.

ఈ ఏడాది ఆరంభంలో వైఆర్‌4 గ్రహశకలం భూమిని ఢీ కొనే ప్రమాదం పెరిగిందంటూ ప్రకటించిన నాసా.. ఇప్పుడు తన అంచనాను మార్చుకొని.. మనవులందరికీ ఒక శుభవార్తను చెప్పింది. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ బృందం 2032లో “2024 వైఆర్‌4” చంద్రుడిని ఢీకొట్టే అవకాశాన్ని ధృవీకరించింది. “ఫిబ్రవరి చివరి నాటికి 1.7 శాతం నుండి 3.8 శాతానికి పెరిగింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో పాటు భూమి ఆధారిత టెలిస్కోపులతో ఆ గ్రహశకలాన్ని పరిశీలించిన తర్వాత.. అది చంద్రుడిని ఢీ కొనే అవకాశం ఉన్నా.. ఒక వేళ అది ఢి కొట్టిన చంద్రుడి కక్ష్య ఏం మారదని కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసి, అక్కడ నివశించాలని మనిషి కలలు కంటున్న సమయంలో అంత భారీ సైజులో ఉన్న ఆ గ్రహశకలం చంద్రుడిని ఢీ కొంటే.. పెను విధ్వంసం ఏమైనా సంభవిస్తుందా? చంద్రడు పూర్తి నాశనం అయ్యే ప్రమాదం ఉందా? అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రహ శకలం చంద్రుడిని ఢీ కొంటే కొంత భాగం దెబ్బ తిన్నా.. పూర్తిగా అయితే చంద్రుడు నాశనం అవ్వడని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహశకలం కారణంగా చంద్రుడికి పెద్దగా ముప్పు ఏమీ లేదని వెల్లడించారు. వెబ్ టెలిస్కోప్‌తో మే నెలలో మళ్ళీ ఒకసారి ఆ గ్రహశకలాన్ని నాసా పరిశీలించనుంది. ప్రస్తుతం చాలా దూరంలో ఉన్న ఆ గ్రహశకలం వేగంగా ప్రయాణిస్తూ వస్తుంది. దగ్గరికి వస్తున్న కొద్ది దాన్ని పరిశీలించడం తేలిక అవుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.