Bizarre: ‘దొరికిపోయాడుగా.. 50 వేల టీషర్ట్స్ ఆర్డర్ పెట్టే పనిలో బెన్‌స్టోక్’.. స్టీవ్ స్మిత్‌పై నెటిజన్ల ఫన్నీ పంచ్‌లు..

|

Jun 11, 2023 | 5:04 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియగా.. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. అయితే, ఆసిస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు.

Bizarre: ‘దొరికిపోయాడుగా.. 50 వేల టీషర్ట్స్ ఆర్డర్ పెట్టే పనిలో బెన్‌స్టోక్’.. స్టీవ్ స్మిత్‌పై నెటిజన్ల ఫన్నీ పంచ్‌లు..
Steve Smith
Follow us on

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ కోసం భారత్, ఆస్ట్రేలియా టీమ్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియగా.. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. అయితే, ఆసిస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీని సాధించాడు. 31 సెంచరీలతో ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మూ డవ అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. రికీపాంటింగ్, స్టీవ్ వా తరువాత స్టీవ్ స్మిత్ నిలిచాడు.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 34 పరగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను రవీంద్ర జడేజా తన అద్భుతమైన బౌలింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. జడేజా బౌలింగ్‌లో స్లాగ్ ఆడేందుకు ప్రయత్నించి.. అసాధారణ రీతిలో ఔట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. స్మిత్ బ్యాటింగ్ సమయంలో స్టేడియంలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. తనకు ఎదురుగా స్టేడియంలో కూర్చున్న వ్యక్తిపై స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. ఎరుపు రంగు టీ షర్మ్ ధరించిన ఆ అభిమానిని లేచి పక్కకు పోవాల్సిందిగా కోరాడు. అంపైర్‌ ద్వారా తన సందేహాన్ని పంపించాడు. అంపైర్ సైతం రెండు చేతులు జోడించి మరీ ఆ వ్యక్తి మరో చోట కూర్చోవాల్సిందిగా కోరాడు. స్టేడియం భద్రతా సిబ్బంది వచ్చి.. ఎరుపు రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తిని మరో చోటకు పంపించారు. ఎరుపు రంగు టీ షర్ట్ కారణంగా.. స్మిత్‌కు బంతిని గుర్తించడంలో ఇబ్బంది అవుతుందట. ఆ కారణంగానే అతన్ని వేరే చోటకు వెళ్లమని కోరాడు స్మిత్.

అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆయా దేశాల క్రికెట్ ప్రేమికులు తకు ఆయుధం దొరికిందంటూ కామెంట్స్, ట్వీట్స్, పోస్టులు పెడుతున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు అయితే, మరో అడుగు ముందుకేసి.. తమ దేశ ప్లేయర్లకు మంచి సలహా ఇస్తున్నారు. త్వరలో జరుగబోయే యాషెస్ ట్రోపీ కోసం బెన్‌స్ట్రోక్‌కు అద్భుతమైన ఆయుధం దొరికిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మైక్ డార్బీ అనే వ్యక్తి చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. ‘స్టీవ్ స్మిత్ వీక్‌నెస్ దొరికింది. బెన్‌స్టోక్‌ కి ఇది సరైన ఆయుద్ధం. బెన్ స్టోక్ ఇప్పటికే అమెజాన్‌లో 50,000 రెడ్ టీ షర్ట్స్ ఆర్డర్ పెట్టే పనిలో ఉన్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..