Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాల్సిందే.. లేదంటే ఏషియన్ గేమ్స్‌లో ఆడం.. కేంద్రానికి రెజ్లర్ల అల్టిమేటం..

|

Jun 10, 2023 | 6:55 PM

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ను ఈనెల 15 లోగా అరెస్ట్‌ చేయాలని రెజర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 15వ తేదీ వరకు వేచి చూస్తామని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయకపోతే ఏషియన్‌ గేమ్స్‌ ఆడే ప్రసక్తే లేదన్నారు సాక్షిమాలిక్‌. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలంటూ తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాల్సిందే.. లేదంటే ఏషియన్ గేమ్స్‌లో ఆడం.. కేంద్రానికి రెజ్లర్ల అల్టిమేటం..
Wrestlers Protest
Follow us on

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ను ఈనెల 15 లోగా అరెస్ట్‌ చేయాలని రెజర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 15వ తేదీ వరకు వేచి చూస్తామని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయకపోతే ఏషియన్‌ గేమ్స్‌ ఆడే ప్రసక్తే లేదన్నారు సాక్షిమాలిక్‌. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలంటూ తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఒత్తిళ్లతోనే బ్రిజ్‌భూషణ్‌పై మైనర్‌ రెజ్లర్‌ తన స్టేట్‌మెంట్‌‌ను వెనక్కి తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బ్రిజ్‌భూషణ్‌తో కాంప్రమైజ్‌ చేసుకోవాలని తమపై ఒత్తడి చేస్తున్నారని ఆరోపించారు సాక్షిమాలిక్‌.

రెజ్లర్లకు మద్దతుగా హర్యానాలోని సోనిపట్‌లో మహాపంచాయత్‌ నిర్వహించారు. ఈనెల 15 లోగా బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్‌ చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఖాప్‌ పంచాయత్‌ నేతలు నిర్వహించారు. బ్రిజ్‌భూషణ్‌ రాజకీయ పలుకుబడితో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మరో రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..