WPL 2026 : స్మృతి మంధాన విశ్వరూపం.. ఫైనల్లో ఆ 53 పరుగులు చేస్తే చాలు.. స్టార్ ప్లేయర్ రికార్డు హుష్ కాకి
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ పోరులో అందరి కళ్లు ఆర్సీబీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పైనే ఉన్నాయి. ఈ ఒక్క మ్యాచ్‌తో ఆమె ఏకంగా ట్రిపుల్ మిషన్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది.

WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ పోరులో అందరి కళ్లు ఆర్సీబీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పైనే ఉన్నాయి. ఈ ఒక్క మ్యాచ్‌తో ఆమె ఏకంగా ట్రిపుల్ మిషన్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం స్మృతి మంధాన మూడో స్థానంలో ఉంది. అయితే నంబర్ 1 స్థానానికి ఆమెకు పెద్ద దూరం ఏమీ లేదు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 8 మ్యాచ్‌ల్లో 342 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, స్మృతి 8 మ్యాచ్‌ల్లో 290 పరుగులతో ఉంది. అంటే, నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఫైనల్లో స్మృతి కేవలం 53 పరుగులు చేస్తే చాలు.. హర్మన్‌ను వెనక్కి నెట్టి ఈ సీజన్ టాప్ స్కోరర్‌గా నిలుస్తుంది. మధ్యలో నాట్ సీవర్ (321 రన్స్) ఉన్నప్పటికీ, స్మృతి మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ మార్కును దాటడం సులువే అనిపిస్తోంది.
హర్మన్ రికార్డును దాటడమే కాకుండా, తన ఇన్నింగ్స్‌ను మరో 11 పరుగులు (మొత్తం 64) ముందుకు తీసుకెళ్తే.. డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్‌గా స్మృతి రికార్డు సృష్టిస్తుంది. అంతేకాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా ఆమె చరిత్ర పుటల్లోకెక్కుతుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 34 మ్యాచ్‌ల్లో 936 పరుగులు ఉన్నాయి.
ఏమిటా ట్రిపుల్ మిషన్?
స్మృతి మంధాన ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు ప్రధాన లక్ష్యాలను (Triple Mission) పెట్టుకుంది.
ఆరెంజ్ క్యాప్: ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసి నంబర్ 1 గా నిలవడం.
వెయ్యి పరుగులు: ఆర్సీబీ తరపున డబ్ల్యూపీఎల్‌లో 1000 పరుగుల మార్కును అందుకోవడం.
రెండోసారి టైటిల్: జట్టుకు వరుసగా రెండోసారి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని అందించి, రెండు టైటిళ్లు గెలిచిన రెండో కెప్టెన్‌గా నిలవడం.
నేటి ఫైనల్లో స్మృతి మంధాన ఈ రికార్డులను అందుకుంటే, ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
