కోహ్లీ స్వదేశానికి రావడం రోహిత్‌శర్మకు కలిసొస్తుంది: మెక్‌గ్రాత్
లిమిటెడ్ ఓవర్ల పోటీలలో రోహిత్‌శర్మ తిరుగులేని ఆటగాడు.. టెస్ట్ మ్యాచ్‌లలో ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవలసి ఉంది.. రాబోయే ఆసీస్ సిరీస్ నిజంగానే రోహిత్‌శర్మకు ఓ పరీక్ష...

లిమిటెడ్ ఓవర్ల పోటీలలో రోహిత్‌శర్మ తిరుగులేని ఆటగాడు.. టెస్ట్ మ్యాచ్‌లలో ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవలసి ఉంది.. రాబోయే ఆసీస్ సిరీస్ నిజంగానే రోహిత్‌శర్మకు ఓ పరీక్ష… పెటెర్నటీ లీవ్‌ల కారణంగా ఆస్ట్రేలియా టూర్ మధ్య నుంచే విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నాడు.. చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లు విరాట్ మిస్సవుతున్నాడు.. ఇది వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మకు కలిసివస్తుందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అంటున్నాడు.. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ ఎన్నో ఘనతలు సాధించాడని, టెస్ట్ మ్యాచ్‌లలో మాత్రం ఇంకా తన మార్క్ చాటలేదని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గైర్హాజరితో రోహిత్ ఆ లోటు తీర్చుకుంటాడనే నమ్మకం తనకు ఉందన్నాడు. కోహ్లీ లేకపోవడం వల్ల భారమంతా రోహిత్‌పైనే పడుతుందని అనుకోలేమని, అజింక్య రహానే, చతేశ్వర్ పూజారా, కేఎల్ రాహుల్‌లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని మెక్‌గ్రాత్ తెలిపాడు. అయితే ఎక్కువ పరుగులు చేసే అవకాశం రోహిత్‌కు ఎక్కువగా ఉందన్నాడు.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ వచ్చే జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది.. అందుకే విరాట్ కోహ్లీ పెటర్నటీ లీవ్ తీసుకుంటున్నాడు.. అడిలైడ్‌లో జరిగే మొదటి టెస్ట్ తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి వస్తాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌లకు రోహిత్‌శర్మ దూరమయ్యాడు. అయితే డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు మాత్రం రోహిత్ ఎంపికయ్యాడు.