Virat Kohli: మరో సారి క్రీడా స్ఫూర్తిని చాటిన కోహ్లీ.. రికార్డులు కాదు.. టీమ్ స్కోర్ ముఖ్యమంటూ..

భారత్- దక్షిణాఫ్రికా మధ్య గువహటి వేదికగా అక్టోబర్ 2వ తేదీ ఆదివారం జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఓ పండుగనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీ అభిమానులకు పెద్ద పండుగే.. అయినా కోహ్లీ అభిమానులు..

Virat Kohli: మరో సారి క్రీడా స్ఫూర్తిని చాటిన కోహ్లీ.. రికార్డులు కాదు.. టీమ్ స్కోర్ ముఖ్యమంటూ..
Virat Kohli, Dinesh Karthik
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 03, 2022 | 6:00 PM

భారత్- దక్షిణాఫ్రికా మధ్య గువహటి వేదికగా అక్టోబర్ 2వ తేదీ ఆదివారం జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఓ పండుగనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీ అభిమానులకు పెద్ద పండుగే.. అయినా కోహ్లీ అభిమానులు మాత్రం కొంత నిరుత్సాహనికి గురయ్యారు. 28 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ.. ఒక పరుగులో అర్థ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో కోహ్లీ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అలాగే చివరి ఓవర్ లో దినేష్ కార్తీక్ సింగిల్ తీసి కోహ్లీకి ఇస్తే బాగున్ను అంటూ కోహ్లీ అభిమానులే కాదు మ్యాచ్ ను చూస్తూ టీవీలకు అతుక్కుపోయిన చాలా మంది క్రికెట్అభిమానులు అదే కోరుకున్నారు. అయితే చివరి ఓవర్ లో కోహ్లికి స్ట్రైయిక్ రాలేదు. దీంతో విరాట్ కోహ్లీ తన ఆఫ్ సెంచరీని కంప్లీట్ చేయలేకపోయాడు. అయితే దినేష్ కార్తీక్ మాత్రం కోహ్లీకి స్ట్రైక్ కావాలా అని అడిగాడు. విరాట్ దానికి నిరాకరించి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. వ్యక్తిగత రికార్డు కంటే జట్టు స్కోర్ ముఖ్యమని విరాట్ కోహ్లీ దినేష్ కార్తీక్ తో చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కగిసో రబాడా వేసిన 20వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. రెండు సిక్స్ లు, ఒక ఫోర్ తో పాటు చివరి బంతికి దినేష్ కార్తీక్ సింగిల్ తీశాడు. ఒక వైడ్ వేయడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.

రెండు బంతులు ఉండగా.. సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలా అని దినేష్ కార్తీక్ కోహ్లీని అడగ్గా.. కోహ్లీ మాత్రం స్కోర్ మీద ఫోకస్ చేయడమని సలహా ఇచ్చాడు. క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లల్లో విరాట్ కోహ్లీ ఒకడు. తన క్రికెట్ కెరీర్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 71సెంచరీల రికార్డు కూడా కోహ్లీ సొంతం. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకే ప్రాధాన్యత ఇస్తాడు కోహ్లీ. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ లో కన్పించింది.

కోహ్లీ చేసిన పనికి క్రికెట్ అభిమానులు మాత్రం హాఫ్‌ సెంచరీ చేయలేదనే నిరాశలో ఉన్నప్పటికి కింగ్ కోహ్లీ క్రీడా స్ఫూర్తికి ఫిదా అవుతున్నారు. మొత్తం మీద ఈ మ్యాచ్ లో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-0తో అధిక్యంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..