విరాట్ కొహ్లీ పదవ తరగతి మార్కుల మెమో చూశారా..లేకుంటే చూసేయండి

|

Mar 30, 2023 | 3:05 PM

విరాట్ కొహ్లికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతను ఏ చిన్న విషయాన్నైనా పోస్టు చేసిన అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే ఐపీఎల్ కు వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున పదహారో సీజన్ లో ఆడేందుకు కొహ్లీ సిద్ధమవుతున్నాడు.

విరాట్ కొహ్లీ పదవ తరగతి మార్కుల మెమో చూశారా..లేకుంటే చూసేయండి
Virat Kohli
Follow us on

విరాట్ కొహ్లికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతను ఏ చిన్న విషయాన్నైనా పోస్టు చేసిన అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే ఐపీఎల్ కు వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున పదహారో సీజన్ లో ఆడేందుకు కొహ్లీ సిద్ధమవుతున్నాడు. 19 సంవత్సరాల వయసున్నప్పడే 2008లో ఆర్సీబీ తో జట్టుకట్టి కెప్టెన్ గానూ చేశాడు విరాట్. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును సాధించలేకపోయాడు. ఐపీఎల్ వచ్చిన ప్రతిసారి విరాట్ సారథ్యంలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవాలని అతని అభిమానులు కోరుకుంటుంటారు. విరాట్ కొహ్లి చెప్పే ఈసాలా కప్ నమ్ దే అనే స్లోగన్ కూడా ఫెమస్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విరాట్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా తన పదోతరగతి మార్కుల జాబితాను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అలాగే ఆ షీట్ పైనా స్పోర్ట్స్ ?.. అంటూ అదనపు సబ్జెక్ట్ గా పెట్టాడు.

2004లో విరాట్ కొహ్లీ పదోతరగతి పాస్ అయినట్లు ఆ మెమోలో కనిపిస్తోంది. ఇంగ్లిష్‌లో 83, హిందీలో 75, మ్యాథ్స్‌లో 51 రాగా.. సైన్స్ అండ్ టెక్నాలజీలో 55, సోషల్ సైన్స్ లో 81 మార్కులు వచ్చాయి. మరి క్రీడలు సంగతి ఏంటన్నట్లుగా వదిలేసి తనదైన శైలిలో విరాట్ క్యాప్షన్‌ ఇచ్చాడు. అసలు ‘‘మార్కుల జాబితాలో కనీసం చోటు లేని సబ్జెక్ట్.. ఇప్పుడు ఎక్కువ భాగం కావడం విశేషంగా ఉంది’’ అనే కోణంలో రాసుకొచ్చాడు. అయితే మార్కుల షీట్‌ మీద స్పోర్ట్స్‌ అనే పదం ఉన్న పోస్టును డిలీట్‌ చేసిన విరాట్.. మళ్లీ మెమోను షేర్‌ చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి