స్మిత్‌కు షాక్.. మళ్లీ టాప్‌లోకి కోహ్లీ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ.. 928 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఈ లిస్ట్‌లో మొన్నటి వరకు టాప్‌లో ఉన్న స్మిత్.. ఈ మధ్యన పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి 923 పాయింట్లతో స్మిత్ రెండో […]
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ.. 928 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇక ఈ లిస్ట్‌లో మొన్నటి వరకు టాప్‌లో ఉన్న స్మిత్.. ఈ మధ్యన పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి 923 పాయింట్లతో స్మిత్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తరువాత స్థానంలో కేన్ విలియమ్స్ సన్, చటేశ్వర పుజారా, డేవిడ్ వార్నర్, అజింక్యా రహానేలు నిలిచారు. అలాగే ఈ ఏడాది ఆరంభంలో 110వ ర్యాంకులో ఉన్న మార్నస్ లబుషేన్.. వరుస శతకాలు కొట్టి.. తొలిసారి టాప్-10లోకి అడుగుపెట్టాడు.
ఇదిలా ఉంటే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం పెద్దగా మార్పులు లేవు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 900 పాయింట్లతో ఆగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా 839 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐదో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 9వ స్థానంలో, మహ్మద్ షమీ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలో జాసన్ హోల్డర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఇక వరుస టెస్టు సిరీస్ విజయాలతో టీమిండియా 120 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతోంది.