Tokyo Olympics: రెజ్లర్ రవి కుమార్ ఉడుంపట్టు.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా సత్తా చాటాడు. పురుషుల 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో కొలంబియా ఆటగాడు..

Tokyo Olympics: రెజ్లర్ రవి కుమార్ ఉడుంపట్టు.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయం
Ravi Dahia

Edited By:

Updated on: Aug 04, 2021 | 7:18 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ రవి కుమార్ దహియా సత్తా చాటాడు. రెజ్లింగ్ 57 కిలోల విభాగంలో 7-9 తేడాతో కజకిస్థాన్ రెజ్లర్ సనయెవ్ నురిస్లామ్‌ను రవికుమార్ ఓడించి ఫైనల్‌కి చేరాడు. రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన రవి దహియా.. ఫైనల్‌లో స్వర్ణ పతకంపై కన్నేశాడు.  మరోవైపు హోరాహోరీగా సాగిన మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్ మ్యాచ్‌ ఓపెనింగ్ బొట్‌లో భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ ఓటమిపాలైంది. బెలారస్‌కు చెందిన కురచకినా చేతిలో 8-2 తేడాతో ఓడిపోయింది..

అటు ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడుగా రేర్ ఫీట్ అందుకున్నాడు. ఈరోజు మ్యాచ్‌లో అందరికంటే ఎక్కువ దూరం(86.65 మీటర్లు) విసిరి మొదటి ప్రయత్నంలోనే ఫైనల్స్‌కు అర్హత సాధించాడు ఈ 23 ఏళ్ల ప్లేయర్. ఇక ఆగష్టు 7న జరగబోయే ఫైనల్‌లో టాప్ 3లో నిలిస్తే పతకం దక్కడం ఖాయమే.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!