Tokyo Olympics: భారత యువ అథ్లెట్ సంచలనం.. జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా దుమ్ముదులిపాడు. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే...

Tokyo Olympics: భారత యువ అథ్లెట్ సంచలనం.. జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా..
Neeraj Chopra 1

టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా దుమ్ముదులిపాడు. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడుగా రేర్ ఫీట్ అందుకున్నాడు. ఈరోజు మ్యాచ్‌లో అందరికంటే ఎక్కువ దూరం(86.65 మీటర్లు) విసిరి మొదటి ప్రయత్నంలోనే ఫైనల్స్‌కు అర్హత సాధించాడు ఈ 23 ఏళ్ల ప్లేయర్. ఇక ఆగష్టు 7న జరగబోయే ఫైనల్‌లో టాప్ 3లో నిలిస్తే పతకం దక్కడం ఖాయమే.

Click on your DTH Provider to Add TV9 Telugu