Tokyo Olympics 2021: మీ పతకం మీరే.. కరోనాతో మారిన ఒలింపిక్ రూల్స్..!

|

Jul 15, 2021 | 7:13 PM

కరోనాతో గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్.. టోక్యో వేదికగా ఈ ఏడాది జులై 23 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కూడా ఈ కరోనా ఒలింపిక్స్‌ను వదిలిపెట్టడం లేదు.

Tokyo Olympics 2021: మీ పతకం మీరే.. కరోనాతో మారిన ఒలింపిక్ రూల్స్..!
Follow us on

Tokyo Olympics 2021: కరోనాతో గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్.. టోక్యో వేదికగా ఈ ఏడాది జులై 23 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం కూడా ఈ కరోనా ఒలింపిక్స్‌ను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే చాలా నిబంధనలను మార్చని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం.. తాజాగా మరో రూల్‌ను మార్చేసింది. విజేతలైన వారికి పతకాలను అతిథులు మెడలో వేస్తారు. కానీ, ఈ ఏడాది అలా జరగబోదంట. ఎవరి మెడల్ వారే వేసుకోవాలని కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. కరోనా కారణంగా ఇలాంటి నిబంధనను తీసుకొచ్చినట్లు నిర్వాహక కమిటీ పేర్కొంది. అయితే, కరోనాతో ఓవైపు టోక్యోలో కేసులు విసరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 1,149 మంది పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో అక్కడ ఈ రేంజ్‌లో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారంట. ఒలింపిక్ క్రీడలకు మరో 9 రోజులే ఉండడంతో.. కోవిడ్‌ కేసులు మరింత పెరుగుతుండడంతో.. జపాన్‌ ప్రభుత్వం, ఐఓసీ, గేమ్స్‌ నిర్వాహక కమిటీలు ఆందోళనలో పడ్డాయి. ప్రస్తుతానికి అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.

జపాన్‌ రాజు టోక్యో క్రీడలను ప్రారంభిస్తారని గేమ్స్‌ నిర్వాహక కమిటీ తెలిపింది. 23న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జపాన్‌ చక్రవర్తి నరుహి హాజరుకానున్నారు. 61 ఏళ్ల రాజు నరుహితో టోక్యో ఒలింపిక్స్‌కు ప్యాట్రన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్ ప్రారంభ వేడుకల్లో భాగంగా ఇంపీరియల్‌ ప్యాలెస్‌లో పలు దేశాల వీఐపీలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, 1998 వింటర్‌ ఒలింపిక్స్‌ను జపాన్ చక్రవర్తి నరుహి తండ్రి అకిహి ప్రారంభించారు. అలాగే 1964 సమ్మర్‌ ఒలింపిక్స్, 1972 వింటర్‌ ఒలింపిక్స్‌లను ఆయన తాత హిరోహి ప్రారంభించారు.

అలాగే ఒలింపిక్ వేడుకల ప్రారంభోత్సవంలో ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను పెంచారు. ముగ్గురితో జరిపే ఈ ప్రతిజ్ఞను ఈసారి ఆరుగురు అథ్లెట్లతో నిర్వహించనున్నారు. లింగ సమానత్వంలో భాగంగా ఇందులో ముగ్గుర మహిళలు, ముగ్గురు పురుషులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Also Read:

IND vs SL: అక్కడ 9 ఏళ్లుగా టీమిండియాకు ఎదురులేదు.. ఈ రికార్డును సీనియర్ ప్లేయర్ కొనసాగించేనా?

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కనిపించిన 9 మంది స్టార్ ఆటగాళ్లు వీరే..!

MS Dhoni: ధోని సహచరుడు దంచేశాడు..10 బంతుల్లో 52 పరుగులు.. 6 సిక్సులు.. 4 ఫోర్లు