
Tokyo Olympics 2021: రెండవసారి ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోన్న జపాన్ దేశం… ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారి 1964లో ఈక్రీడలను నిర్వహించిన జపాన్.. మరలా 2021లో ఈ అవకాశం దక్కింది. గతేడాది జరగాల్సిన ఈ క్రీడలు.. కరోనాతో ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. కఠిన పరిస్థితుల్లోనూ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసిన జపాన్ ప్రభుత్వం.. పతకాల తయారీలోనూ తమ సంప్రదాయాన్ని జోడించి ఔరా అనిపించింది.
పతకాల తయారీలో తమ మార్స్ చూపించాలని అనుకున్న జపాన్ ప్రభుత్వం.. మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేసింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం నుంచే ఆ దేశ ప్రజల నుంచి పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. మొబైల్ ఫోన్స్‌లోని లోహ విడిభాగాలను వేరు చేసి, వాటిని కరిగించారు. అనంతరం వాటినుంచి పతకాలను తయారు చేశారు. లేటెస్ట్ కంప్యూటర్ డిజైన్లతో పతకాలను డిజైన్ చేసి, ఆకట్టుకునేలా తయారు చేశారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి పతకాలు తయారుచేయడంతో అంతా మెచ్చుకుంటున్నారు.
పతకాలనే కాదు.. పతకాల ట్యాగ్‌లను కూడా వెరైటీగానే రూపొందించారు. లోకల్‌గా రూపొందించిన దారాలతో వీటిని తయారుచేశారు. అలాగే పతకాలను ఉంచేందుకు ప్రత్యేకంగా కలపతో డబ్బాలను తయారుచేశారు. మరోవైపు కరోనా నేపథ్యంలో పతకాలను గెలుచుకున్న ఆటగాళ్లే ఎవరి మెడలో వారే ధరించాలని ఐఓసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read:
Tokyo Olympics 2021 Live: పురుషుల ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ భారత ప్లేయర్స్ పేలవ ప్రదర్శన..
IND Vs SL: జోష్ మీదున్న టీమిండియా.. వైట్‌వాష్‌కు తహతహ.. టీంలో కీలక మార్పులు.?