Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌కు మరో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నారు. భారత్ నుంచి మొత్తం 228 మంది టోక్యో ఒలింపిక్స్ వెళ్లనున్నారు. మొత్తం 85 విభాగాల్లో పోటీపడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. ఈమేరకు అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు సెలబ్రెటీల నుంచి భారత ప్రధాని వరకు అంతా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రదాని నరేంద్ర మోడీ గత మంగళవారం అథ్లెట్లతో సమావేశమయ్యారు. అందిరితో మాట్లాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. తాజాగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘చీర్4ఇండియా’ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఈ పాటకు సంగీతం అందించారు. యువ గాయని అనన్య బిర్లా ఈ పాటను పాడారు. ఈ సందర్భంగా మంత్రి ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఈ పాటను వినాలని, ఇతరులకు షేర్ చేయాలని కోరారు. అలాగే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఆర్ రహమాన్, సింగర్ అనన్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా కారణంగా అథ్లెట్ల సన్నాహాలకు ఎదురైన ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులను అధిగమించిన తీరుపై ఈ సాంగ్ ఉందని ఐఓఏ చీఫ్ నరీందర్ బాత్రా తెలిపారు.
జులై 23 నుంచి మెగా క్రీడలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. తొలి విడతగా జులై 17న కొంతమంది ప్లేయర్లు టోక్యో వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అథ్లెట్లతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలను అందుకోవాలని, భారీ అంచనాలతో భయపడకుండా, అత్యుత్తమ రాణించాలని పిలుపునిచ్చారు. మీకు అండగా దేశం మొత్తం ఉందని, క్రీడా వేదికపై భారత పతాకం ఎగురవేయాలని కోరారు. గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు.. కరోనా కారణంగా ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే.
The Official Team India Cheer Song is out now!!
With just 9 Days to #Tokyo2020 let’s all unite & cheer for Team India the #HindustaniWay #Cheer4India @PMOIndia @ianuragthakur @NisithPramanik @WeAreTeamIndia @arrahman @ananya_birla
Watch full song?https://t.co/8H3bfHRojH pic.twitter.com/NJHZ1ejMq1
— SAIMedia (@Media_SAI) July 14, 2021
Union Sports Minister @ianuragthakur virtually launches official cheer song for #TokyoOlympics-bound Indian contingent
The song, titled ‘Hindustani Way’, is performed by young pop singer @ananya_birla and composed by @arrahman#Cheer4India pic.twitter.com/XSLJLlezv6
— MIB India ?? #We4Vaccine (@MIB_India) July 15, 2021
Also Read:
Rohit sharma: వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు..!