Tokyo Olympics 2020: ఒలింపిక్స్ కోసం వీటిని వదిలేసిన సింధు.. వాటితోనే ట్రీట్‌కు రెడీ అయిన ప్రధాని మోడీ..!

|

Aug 02, 2021 | 9:16 AM

టోక్యో ఒలింపిక్స్ 2020లో ప్రపంచ ఛాంపియన్ ఆరవ సీడ్ పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హీ బింగ్ జియావోను వరుస గేమ్‌లలో ఓడించి ఆమె చరిత్ర సృష్టించింది.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్ కోసం వీటిని వదిలేసిన సింధు.. వాటితోనే ట్రీట్‌కు రెడీ అయిన ప్రధాని మోడీ..!
Pm Modi And Pv Sindhu
Follow us on

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ 2020లో ప్రపంచ ఛాంపియన్ ఆరవ సీడ్ పీవీ సింధు కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హీ బింగ్ జియావోను వరుస గేమ్‌లలో ఓడించి ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. ఐదేళ్ల క్రితం రియోలో రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, బీజింగ్ 2008 గేమ్స్‌లో కాంస్య పతకం, లండన్ 2012 గేమ్స్‌లో రజత పతకం సాధించడం ద్వారా వెటరన్ రెజ్లర్ సుశీల్ కుమార్ రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు సింధు కూడా అతనితో సమానంగా నిలిచింది. టోక్యో ఒలింపిక్ క్రీడలలో భారత్‌కు రెండవ పతకాన్ని అందించింది. ఇంతకుముందు, మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో భారతదేశానికి రజత పతకాన్ని అందించింది. అలాగే పీవీ సింధు.. రియో ​​ఒలింపిక్ 2016 క్రీడల్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్‌లో రజత పతకం గెలిచిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి రజత పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సాధించింది.

ఇటీవలి కాలంలో పీవీ సింధు బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి అనేక విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం ఆమె తన ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వచ్చిందంట. 2016 లో పతకం గెలిచిన తర్వాత, ఒలింపిక్స్‌కు ముందు కోచ్ పుల్లెల గోపీచంద్ సింధు నుంచి మొబైల్ లాక్కున్నారన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు, ఐస్ క్రీం తినడం కూడా నిషేధించాడంట. సింధు రజత పతకం గెలిచిన తరువాతే ఐస్ క్రీం తిన్నదంట. టోక్యో ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ముందు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత స్టార్ షట్లర్‌తో మాట్లాడారు. ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సింధుతో కలిసి ఐస్ క్రీం తింటానని చెప్పడం విశేషం. ప్రధానిని కలిసినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. పీవీ సింధు క్రీడా నేపథ్యం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి, తల్లి ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. సింధు తండ్రి పీవీ రామన్న 1986లో సియోల్ ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో భాగం. అతను 2000 సంవత్సరంలో అర్జున అవార్డును కూడా అందుకున్నాడు. అయితే, ఆమె తల్లిదండ్రుల ఆటను కాకుండా.. సింధు బ్యాడ్మింటన్‌ను ఎంచుకుంది. ఆమె ఎనిమిదేళ్ల వయసు నుంచి బ్యాడ్మింటన్ ఆడుతోంది.

పీవీ సింధు 14 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ సర్క్యూట్‌లో ప్రవేశించింది. 16 సంవత్సరాల వయస్సులో సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో మొదటిసారి ఆడారు. ఆ తరువాత క్రమంగా విజయాలను అలవాటుగా చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించిన భారత క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో సింధు రెండు కాంస్య, రెండు రజత, ఒక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పీవీ సింధు 2018, 2019 లో అత్యధిక పారితోషికం పొందిన మహిళా ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. మార్చి 2017 ఎకనామిక్ టైమ్స్ నివేదికలో, విరాట్ కోహ్లీ తర్వాత సింధు నిలిచింది. ఫిబ్రవరి 2019 లో, సింధు చైనీస్ స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్‌తో 4 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ .50 కోట్లు. ఇది బ్యాడ్మింటన్ చరిత్రలో అతిపెద్ద ఒప్పందాలలో ఒకటి.

Also Read: IND vs ENG: 5 టెస్టుల్లో 5 రికార్డులపై కన్నేసిన టీమిండియా కెప్టెన్.. ఆ దిగ్గజాల సరసన చేరే అరుదైన అవకాశం!

Tokyo Olympics 2020: టోక్యో నుంచి ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్ వరకు.. భారత బ్యాడ్మింటన్ క్వీన్ 8ఏళ్ల జర్నీ..!