Tokyo Olympics 2020, Day 3: రెండవరోజు భారత ఆటగాళ్లు అనుకున్నంతగా రాణించలేకపోయారు. పతకాలలో మాత్రం బోణీ కొట్టింది. మీరాబాయి చాను రెండో రోజు రజత పతకం సాధించి భారత్ తరపున తొలి పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్ మూడవ రోజు (జులై 25) న జరగబోయే పోటీలపై అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. నేడు (ఆదివారం) భారత్ అథ్లెట్లు 9 ఆటలలో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరిలో మేరీ కోమ్, పీవీ సింధు కూడా ఉన్నారు.
టోక్యో ఒలింపిక్స్ మూడవ రోజు, బ్యాడ్మింటన్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్విమ్మింగ్, సెయిలింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్‌లో పతకాలు సాధించడానికి భారత్ చూస్తుంది. పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. బాక్సింగ్‌లో పురుషుల, మహిళల పోటీలు జరగనున్నాయి. పురుషుల తేలికపాటి విభాగంలో మనీష్ కౌశిక్ పతకం సాధించే లిస్టులో ఉన్నాడు. అలాగే మహిళల ఫ్లై వెయిట్ విభాగంలో అందరి కళ్లు 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ మీద ఉన్నాయి. ఇవే కాకుండా, జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్ తన మొదటి ఒలింపిక్ ప్రయాణం మొదలుపెట్టనుంది.
భారత ఆస్ట్రేలియా మధ్య హాకీ పోరు..
జులై 25 న భారత హాకీ జట్టు తన రెండవ మ్యాచులో ఆస్ట్రేలియా పురుషుల జట్టుతో తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి విజయాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆసీస్‌ను ఓడించడం టీమిండియాకు అంత సులభం కాదు. భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య హాకీ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. హాకీతో పాటు, రోయింగ్‌లో పురుషుల తేలికపాటి ఈవెంట్‌లో అరుణ్ లాల్, అరవింద్ సింగ్‌లు బరిలోకి దిగనున్నారు.
10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్..
టోక్యో ఒలింపిక్స్ మూడవ రోజు అర్హత రౌండ్, తరువాత షూటింగ్‌లో మహిళల, పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో ఫైనల్స్ ఉన్నాయి. అంతకుముందు జులై 24 న మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్ నిరాశపరిచింది. మనూ భాకర్, యశస్విని దేశ్వాల్ భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచారు. ఇవే కాకుండా, సెయిలింగ్‌లో పురుషుల, మహిళల పోటీలు జరగనున్నాయి.
— rajeev mehta (@rajeevmehtaioa) July 24, 2021
Also Read:
Tokyo Olympics 2021: నిరాశ పరచిన భారత మహిళా హాకీ జట్టు.. నెదర్లాండ్ చేతితో 1-5 గోల్స్ తేడాతో ఓటమి