Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ.. ఇంటిముఖం పట్టిన పురుషుల ఆర్చరీ టీం

|

Jul 26, 2021 | 11:48 AM

కిమ్ జె డియోక్, కిమ్ వూజిన్, ఓహ్ జిన్‌హీక్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణదీప్ రాయ్‌ల భారత జట్టును 6-0తో ఓడించి సెమీస్‌కు చేరుకున్నారు.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ.. ఇంటిముఖం పట్టిన పురుషుల ఆర్చరీ టీం
Indian Archery Team
Follow us on

Tokyo Olympics 2020: యుమెనోషిమా ర్యాంకింగ్ ఫీల్డ్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన పురుషుల ఆర్చరీ టీం క్వార్టర్ ఫైనల్‌ ఈవెంట్‌లో భారత త్రయం ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణదీప్ రాయ్ దక్షిణ కొరియాపై కఠినమైన సవాల్‌ను ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో కొరియన్ల బాణాలకు భారత ఆటగాళ్లు నిలబడలేకపోయారు. జిమ్ జె డియోక్, కిమ్ వూజిన్, ఓహ్ జిన్‌హీక్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు భారత జట్టును క్వార్టర్ ఫైనల్‌లో 6-0తో ఓడించి సెమీస్‌కు చేరుకుంది. కొరియా ఆటగాళ్లు 29 పాయింట్లు(10-10-9) సాధించగా, భారత ఆటగాళ్లు 8-10-10తో (28) పాయింట్లు సాధించారు. కొరియన్లు మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం చెలాయించారు. దీంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆర్చరీ టీం నుంచి పతకం ఆశించిన భారత్ ఆశలు ఆవిరయ్యాయి.

మూడో సెట్‌ను 56-54తో దక్షిణ కొరియా చేజిక్కించుకుంది, దానితో మ్యాచ్ 6-0తో ఉంది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణదీప్ రాయ్‌లు క్వార్టర్ నుంచి వెనుదిరిగారు. అంతకుముందు భారత త్రయం అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణదీప్ రాయ్‌లు.. కజకిస్తాన్ పురుషుల జట్టును 6-2 తేడాతో ఓడించారు. ప్రీ-క్వార్టర్లో భాగంగా జరిగిన ఈ మ్యాచులో అద్భుత విజయం సాధించింది. భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియా జట్టుతో తలపడేందుకు సిద్ధమయ్యారు. కజకిస్థాన్‌తో భారత ఆర్చర్లు గొప్ప ఆరంభాన్ని అందించారు. తొలి రౌండ్‌లో భారత్‌ 2 పాయింట్లు దక్కించుకుంది. అతాను జాదవ్‌ పర్ఫెక్ట్ 10తో భారత్‌కు ఈ పాయింట్లు లభించాయి. రెండవ సెట్‌లోనూ భారత ఆర్చర్లు గెలిచారు. ఖజకిస్తాన్ 8-8-8తో ప్రారంభించరు. దీనికి భారత్ 10-9-9తో బదులిచ్చింది. అనంతరం కజకిస్తాన్ రెండో రౌండ్లో 9-9-8 స్కోరు సాధించగా, భారత్ కూడా ఈ రౌండ్లో 8-7-9తో గెలిచింది.

Also Read:

Tokyo Olympics 2020 Live: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ రాంకిరెడ్డి జోడీ ఓటమి.. క్వార్టర్ ఫైనల్లో ముగిసిన పురుషుల ఆర్చరీ ప్రయాణం!

World Cadet Championship: ప్రధానిని మెప్పించిన డబ్ల్యూసీసీ టీం.. 5 స్వర్ణాలతో సహా 13 పతకాలు సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లు