Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. అదరగొట్టిన మీరాభాయి..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. రెండో రోజు శనివారం జరిగిన మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో ఏస్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి..

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. అదరగొట్టిన మీరాభాయి..
Meerabhai

Edited By:

Updated on: Jul 24, 2021 | 2:29 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. రెండో రోజు శనివారం జరిగిన మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో ఏస్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్ పతకాన్ని సాధించారు. రెండో ప్రయత్నాలు అదరగొట్టిన మీరాభాయి.. మూడో ప్రయత్నంలో విఫలం కావడంతో రెండో స్థానంలో నిలిచారు.

ఇక ఇదే విభాగంలో స్వర్ణ పతకాన్ని చైనాకు చెందిన చెందిన హౌ జిహుయికి దక్కింది. మీరాభాయి మొత్తం స్కోరు 202 కిలోలు కాగా, స్వర్ణ పతకం 8 కిలోలలో చేజారింది. ఇక ఒలింపిక్ క్రీడల ప్రారంభ రోజున భారత్ పతకం సాధించడం ఇదే మొదటిసారి. అలాగే ఒలింపిక్ గేమ్స్‌లోని వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్ గెలిచిన మొదటి పధకం కూడా ఇదే.

టోక్యో ఒలింపిక్స్‌లో దేశం కోసం తొలి పతకం సాధించిన మీరాభాయికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు.

”ఇంతకన్నా మంచి ఆరంభం ఇంకేం కావాలి. మీరాభాయి ప్రదర్శనకు భారతదేశం గర్విస్తోంది. వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన ఆమెకు అభినందనలు. మీరాభాయి విజయం ప్రతీ భారతీయ పౌరుడిని ప్రేరేపిస్తుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్..

టోక్యో ఒలంపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న మీరాభాయికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు.

అటు భారత యువ షూటర్ సౌరభ్ చౌదరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అదరగొట్టాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సౌరభ్‌ మొత్తం 586 పాయింట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మొత్తం ఆరు రౌండ్లలో సౌరభ్ వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. మొత్తం 36 మంది పోటీపడగా సౌరభ్‌ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత షూటర్ అభిషేక్‌ వర్మ 575 పాయింట్లతో 17వ స్థానానికి పరిమితం అయ్యాడు. దీంతో ఆయన ఈ పోటీల నుంచి నిష్క్రమించాడు. ఇక ఫైనల్స్‌ చేరిన సౌరభ్ అక్కడ కూడా ఇదే దూకుడు కనబరిస్తే భారత్ ఖాతాలోకి మరో పతకం చేరడం ఖాయం అని చెప్పవచ్చు.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!